ఉల్లి కృత్రిమ కొరత.. నేడు కిలో ఉల్లిగడ్డ ధర ఎంతంటే..

ఉల్లి పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆకాశానికి అంటుతున్న ధరలతో బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతానికి అది రూ.60 చేరి.. మరింత అందకుండా పోతోంది. వర్షాల కారణంగా కొంత దిగుమతి తగ్గినా.. పలువురు వ్యాపారులు మాత్రం భారీగా నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

news18-telugu
Updated: October 1, 2019, 12:25 PM IST
ఉల్లి కృత్రిమ కొరత.. నేడు కిలో ఉల్లిగడ్డ ధర ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆకాశానికి అంటుతున్న ధరలతో బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతానికి అది రూ.60 చేరి.. మరింత అందకుండా పోతోంది. వర్షాల కారణంగా కొంత దిగుమతి తగ్గినా.. పలువురు వ్యాపారులు మాత్రం భారీగా నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎప్పటిలాగే నిత్యావసరాలపై నియంత్రణ కరువు కావడం.. అధికారుల విరుగుడు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఉల్లిగడ్డ కొనేందుకు నిరాసక్తత చూపుతున్నారు. నాలుగు రోజులు కూరల్లో ఉల్లిగడ్డ వాడకపోతే ఇబ్బందేమీ లేదని అంటున్నారు. వినాయకచవితి పండుగ సమయంలో కిలో రూ.15 అమ్మగా, కేవలం 20 రోజుల్లో రూ.60కి చేరింది. ఉల్లిగడ్డ ధర అనూహ్యాంగా పెరగడంతో సామాన్యులపై పెనుభారం పడుతోంది. తెలంగాణకు మహారాష్ట్రలోని నాసిక్‌, ఏపీలోని కర్నూల్‌ జిల్లా నుండి ఉల్లిగడ్డ దిగుమతి అవుతోంది. ఆగస్టులో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో మహారాష్ట్ర నుండి దిగుమతి అనూహ్యంగా తగ్గింది. దీంతో పాటు కర్నూల్‌ నుండి దిగుమతి అయ్యే ఉల్లి పంట మరో నెల ఆలస్యం కావడంతో కర్నూల్‌ నుండి దిగుమతి నిలిచిపోయింది.

దీంతో ఉల్లిగడ్డ దిగుమతులు పూర్తిగా తగ్గిపోవడంతో ఇది గమనించిన టోకు వ్యాపారులు దిగుమతి అవుతున్న సరుకులో సగానికి పైగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడంతో ఒక పక్క తగినంత సరఫరా లేకపోవడంతో ఉల్లి రేటు 20 రోజుల్లోనే నాలుగు రెట్లకు పెరిగింది. సాధారణంగా ఉల్లి ధర అమాంతంగా పెరిగి నప్పుడు, దిగుమతులు తగ్గినప్పుడు పరిస్ధితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపి నల్లబజార్‌లో అధిక ధరలకు అమ్మే టోకు వ్యాపారులపై నిఘా పెంచి పరిస్థితిని చక్కపెట్టిన సందర్భాలు ఉన్నాయి.

అంతేకాకుండా పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఉల్లిగడ్డ దిగుమతులను పెంచి పౌరసరఫరాల శాఖకు అధికారాలు బద లాయించి కొంత రాయితీని భరించి ఉల్లిగడ్డను మార్కెట్‌లోకి తెస్తారు. ఇదిలా ఉండగా నిత్యవసర వస్తువుల్లో భాగమైన ఉల్లిగడ్డ సరఫరాకు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు