• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • ADULT STAR MIA MALKOVA BUYS FAMOUS PORTLAND BLACKBERRY CASTLE SSR

మియా మాల్కోవా ఈ భూతల స్వర్గాన్ని ఎంతకు సొంతం చేసుకుందో తెలిస్తే...

మియా మాల్కోవా

దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్‌టీ(గాడ్, సెక్స్,ట్రూత్) తో కుర్రకారును మత్తెక్కించిన శృంగార తార మియా మాల్కోవా గుర్తుండే ఉంటుంది. పోర్న్ ఇండస్ట్రీలో ఇప్పుడీ అమ్మడు సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే దూకుడులో...

  • Share this:
    దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్‌టీ(గాడ్, సెక్స్,ట్రూత్) తో కుర్రకారును మత్తెక్కించిన శృంగార తార మియా మాల్కోవా గుర్తుండే ఉంటుంది. పోర్న్ ఇండస్ట్రీలో ఇప్పుడీ అమ్మడు సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే దూకుడులో ఈ 28 ఏళ్ల సెక్సీ భామ తాజాగా ఓ భవంతిని కొనుగోలు చేసింది. 3.9 మిలియన్ డాలర్లతో పోర్ట్‌లాండ్‌లో ఓ విలాసవంతమైన భవంతిని సొంతం చేసుకుంది. ప్రొడ్యూసర్ ఎలి టక్కర్, మియా మాల్కొవా కలిసి ఈ భవంతిని కొన్నారు. ఈ విలాసవంతమైన భవనంలో ఇకపై మియా మల్కోవాతో శృంగార చిత్రాలను తెరకెక్కించనున్నారు. కోటలా ఠీవీగా కనిపించే ఈ భవంతి అంటే తనకు చాలా ఇష్టమని మియా మాల్కోవా చెప్పుకొచ్చింది. ఈ భవంతిలో చాలానే ప్రత్యేకతలున్నాయి.

    13,000 స్వ్కేర్ ఫీట్ల ఈ మ్యాన్షన్‌లో ఐదు విలాసవంతమైన బెడ్‌రూంలు, విశాలమైన బాత్రూమ్‌లు, స్వర్గాన్ని తలపించే గార్డెన్, యూరోపియన్ మార్కెట్‌ను గుర్తుచేసేలా స్ట్రింగ్ లైట్స్, గ్లాస్ సీలింగ్, రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికే మూవీ థియేటర్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భవంతి విశేషాలు చాలానే ఉన్నాయి.

    ఇదిలా ఉండగా.. మియాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆమెను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ఫొటోలకు మిలియన్లలో లైక్స్ వస్తుంటాయి. ఈ భవంతి కొనుగోలులో మియాతో భాగమైన నిర్మాత టక్కర్ మాట్లాడుతూ.. అడల్ట్ పరిశ్రమకు ఈ భవంతిని ఒక డిస్నీలాండ్‌లా తయారుచేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
    Published by:Sambasiva Reddy
    First published: