ఏనుగులు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని సార్లు వాటి ప్రవర్తన తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. కొంత మంది మావటి వాళ్లు, ట్రైనర్స్ ఏనుగులను తమ ఇంట్లోనే పెంచుకుంటారు. తమ ఇంట్లోని ఒక వ్యక్తిలాగ చూసుకుంటారు. మెయిన్ గా గున్న ఏనుగులు (Elephant) చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అవి పరిగెత్తుకుంటూ వెళ్లడం, ఏదైన బాల్ ను తన్నడం లాంటివి చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏనుగుల ఫన్నీ వీడియోలు కొన్ని వైరల్ గా (Viral videos) మారాయి.
నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని , ఒక గున్నఏనుగు వెళ్లి కాపాడుతుంది. మరికొన్ని చోట్ల ఏనుగులు.. గోడలను పగల కొట్టి.. కిచెన్ లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న పదార్థాలను తింటుంటాయి. అదే విధంగా.. కొన్ని చోట్ల ఏనుగులు గ్రామాలపైకి, రోడ్డుపైన వెళ్తున్న వారిపైన దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అదే విధంగా, ఏనుగులు కొన్నిసార్లు.. ఫన్నీగాను ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
View this post on Instagram
పూర్తి వివరాలు.. థాయిలాండ్ లో (Thailand) ఫన్నీ ఘటన జరిగింది. చియాంగ్ మయి సిటిలో ఉన్న ఒక రిసార్ట్ లో ఇది జరిగింది. ఒక యువతి.. లోకల్ గా ఉన్న రిసార్ట్ లో కిటికి పక్కన పడుకుంది. ఈ క్రమంలో.. కిటికి దగ్గరకు ఒక ఏనుగు వచ్చింది. మెల్లగా కిటికి నుంచి తుండాన్ని దూర్చింది. అక్కడ పడుకుని ఉన్న మహిళ నడుమును తట్టింది. అంతటితో ఆగకుండా.. తన తుండంతో గాలిని ఉదుతూ.. ఆమె నిద్రను చెడగొట్టింది. యువతి.. ఎవరో తడుతున్నట్లు భావించింది. వెంటనే.. దుప్పటి తీసి చూసింది. అప్పుడు కిటికి నుంచి ఏనుగు తుండం కన్పించింది.
వెంటనే ఆమె షాక్ నకు గురైంది. బెడ్ మీద లేచి కూర్చుని ఏనుగువైపుకు చూస్తు ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోను (Video) సాక్షి జైన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇదేం రా నాయన అంటూ కామెంట్ లను పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant, Thailand, Viral Video