Viral Video: దేవుడా.. ఓ మంచి దేవుడా..అన్నం తినే ముందు దైవాన్ని ప్రార్థిస్తున్న కుక్కపిల్లలు..

Photo Credit : Twitter

Viral Video: మన భాష తెలియకపోయినా వాటి మ‌న‌సులో మాత్రం భోజ‌నానికి ముందు ప‌ర‌మాత్మ‌ను స్మ‌రించుకోవాలనే ఆలోచన రావడం మంచి విషయమని కామెంట్లు రాస్తున్నారు. ఈ వీడియో మ‌న‌సుకు హ‌త్తుకుంది అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు.

  • Share this:
సాధారణంగా భారతీయులు భోజనం చేసే ముందు దైవాన్ని స్మరించుకుంటారు. ఆహారాన్ని దైవంగా భావించడం అందరికీ తెలిసిందే. కానీ మనుషులతో పాటు తన పెంపుడు కుక్కపిల్లలకు కూడా ఈ విషయం అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు ఒక మహిళ. రెండు కుక్క పిల్లలు య‌జ‌మాని నేర్పుతున్న పాఠాలను నేర్చుకుంటున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వైశాలీ మాధూర్ అనే ట్విట్ట‌ర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియోలో వైశాలీ స్నేహితురాలితో పాటు రెండు కుక్కపిల్లలు క‌నిపిస్తున్నాయి. ఒక మ‌హిళ త‌న పెంపుడు కుక్క పిల్ల‌ల‌కు భోజ‌నం చేసే ముందు కృత‌జ్ఞ‌తా భావంతో దైవాన్ని స్మ‌రించుకోవ‌డం నేర్పుతుంది. యజమాని చెప్పినట్లే చేస్తున్న ఆ కుక్కపిల్లలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వైరల్ వీడియోకు ఇప్ప‌టికే 30,000 వ్యూస్ వచ్చాయి.

వీడియోలో ఏముంది?
ఆహారం ఉంచిన రెండు గిన్నెల‌కు ఎదురుగా రెండు కుక్క‌పిల్ల‌లు కూర్చొని ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వాటి యాజ‌మాని ఆదేశం కోసం అవి ఎదురు చూస్తున్నాయి. ఇదే సమయంలో య‌జ‌మాని అయిన మ‌హిళ, భోజనానికి ముందు రెండు చేతులు జోడించి ప్రార్థ‌న చేస్తోంది. ఇలా దైవ స్మరణ పూర్త‌య్యే వ‌ర‌కూ రెండు కుక్క పిల్లలూ క‌ద‌ల‌కుండా ఎంతో ఓపిక‌గా కూర్చొని ఉన్నాయి. ప్రార్థ‌న ముగిసిన త‌ర్వాత ఆహారం పెట్టిన గిన్నెలు చూపించ‌గానే, వెంట‌నే అవి క‌డుపు నిండా తిన్నాయి. ‘నా స్నేహితురాలు త‌న కుక్క‌పిల్ల‌ల‌కు భోజ‌నానికి ముందు ప్రార్థ‌న చేసుకోవ‌డం నేర్పుతున్న ఈ హార్ట్ వామింగ్ వీడియో షేర్ చేస్తున్నాను. నాకైతే ఈ రెండు గుడ్ బాయ్స్‌లా క‌నిపిస్తున్నాయి’ అని వైశాలి ఈ వీడియోకు ట్యాగ్ పెట్టారు.






ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మన భాష తెలియకపోయినా వాటి మ‌న‌సులో మాత్రం భోజ‌నానికి ముందు ప‌ర‌మాత్మ‌ను స్మ‌రించుకోవాలనే ఆలోచన రావడం మంచి విషయమని కామెంట్లు రాస్తున్నారు. ఈ వీడియో మ‌న‌సుకు హ‌త్తుకుంది అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. ట్విట్టర్‌లో ఈ వీడియో ఇప్పటి వరకు 1400 లైకుల‌తో పాటు వందల రీట్వీట్‌లు సాధించింది.
Published by:Sridhar Reddy
First published: