TikTok: టిక్‌టాక్‌‌లో రచ్చ చేస్తున్న అవ్వామనవళ్లు.. కొలవెరీ ఢీ అంటూ..

TikTok: ఓ బామ్మకు కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే తెగ ఇష్టం.. కానీ, పుట్టి పెరిగిన చోటు, కట్టుబాట్లు ఆమెను రంగ స్థలం స్టేజీ ఎక్కనివ్వలేదు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 4:01 PM IST
TikTok: టిక్‌టాక్‌‌లో రచ్చ చేస్తున్న అవ్వామనవళ్లు.. కొలవెరీ ఢీ అంటూ..
(Image: TikTok) టిక్‌టాక్ ఫోటో..
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 11, 2019, 4:01 PM IST
టిక్‌టాక్.. చిన్న బుడతడి నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ ఒక ఊపు ఊపేస్తున్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా తమ నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ, లైకులు, కామెంట్లతో ప్రశంసలు అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఎందరో. నటన మీద ఆసక్తి ఉన్నా, నటించే అవకాశం దొరక్క ఇబ్బందులు పడుతున్న ఎందరో నటసార్వభౌములకు అద్భుతమైన యాక్టింగ్ స్టేజీ.. ఈ టిక్‌టాక్. ఓ బామ్మకు కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే తెగ ఇష్టం.. కానీ, పుట్టి పెరిగిన చోటు, కట్టుబాట్లు ఆమెను రంగ స్థలం స్టేజీ ఎక్కనివ్వలేదు. అయితే, ఈ యాప్ ఆమెలోని నటనను ప్రపంచానికి తెలిపింది. దేశమంతా ఫేమస్ అయిన కొలవెరి ఢీ.. పాటకు అద్భుతమైన హావభావాలు ఇస్తూ చేసిన టిక్‌టాక్ వీడియో నెటిజన్ల మనసును దోచేసింది.

తన మనవడు అక్షయ్ పార్థతో కలిసి చేసిన ఆ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల లైకులను, బోలెడన్ని కామెంట్లను దక్కించుకుంది. ఇంకేముంది.. అప్పటి నుంచి ఆమె, తన మనవడు పలు హిందీ, తమిళ పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ లక్షలాది మంది ఫాలోయర్లను దక్కించుకున్నారు. టిక్‌టాక్ యాప్‌లో వీరి వీడియో ఒక్కటి అప్‌లోడ్‌ అయినా సరే... క్షణాల్లోనే లైకులు, కామెంట్లతో హోరెత్తుతోంది. ప్రస్తుతం ఈ బామ్మ.. నెట్టింటిని ఏలేస్తోంది.





First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...