హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Painting By Dog: పెయింటింగ్ వేసిన కుక్కపిల్ల... వైరల్ అవుతున్న వీడియో

Painting By Dog: పెయింటింగ్ వేసిన కుక్కపిల్ల... వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ఈ కుక్క పిల్ల హక్స్లే కి సొంతం గా huxleythepaanduppy పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ కూడా ఉంది. అది పెయింటింగ్ వేసిన వీడియోను ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేయగానే ఆ అకౌంట్ కి ఫాలోవర్లు కూడా వేగంగా పెరిగిపోవడం విశేషం.

  సాధారణంగా కొన్ని వీడియోలు మనల్ని ఎంటర్ టైన్ చేసేవిగా ఉంటాయి. మరికొన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఒక కుక్కపిల్ల పెయింటింగ్ వేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 'హక్స్లే' అనే పేరు ఉన్న ఈ కుక్క పిల్ల పెయింటింగ్ వేస్తుండగా తీసిన వీడియో తో పాపులర్ గా మారిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని లక్షల మంది చూశారు. దీంతో ఆ కుక్కను అభిమానించే వారి సంఖ్య సైతం పెరిగింది.

  ఈ కుక్క పిల్ల హక్స్లే కి సొంతం గా huxleythepaanduppy పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ కూడా ఉంది. అది పెయింటింగ్ వేసిన వీడియోను ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేయగానే ఆ అకౌంట్ కి ఫాలోవర్లు కూడా వేగంగా పెరిగిపోవడం విశేషం. ఎక్కువమంది చూస్తూ షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

  వీడియోలో ఏముంది..?  తాజా వీడియో క్లిప్‌లో హక్స్లే ఒక పేపర్‌పై పెయింటింగ్ వేసింది. ఒక కళాకృతికి రంగులు అద్దిందా అన్నట్లు ఉన్న ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ ఆర్ట్ వర్క్ కోసం కుక్క బ్లూ కలర్‌ను ఎంచుకుంది. ముందు కాళ్లతో అది పెయింటింగ్ వేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 'మిమ్మల్ని ఉత్తేజంగా మార్చేందుకు హక్స్లే ప్రయత్నిస్తోంది' అనే క్యాప్షన్ పెట్టారు. ఒక నిమిషం మాత్రమే ఉన్న ఈ వీడియో క్లిప్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వస్తున్నాయి. హక్స్లే పెయింటింగ్‌ను చూసిన తరువాత చాలామంది వ్యక్తులు దీని పనితీరును మెచ్చుకుంటున్నారు.

  కామెంట్లతో సందడి..

  ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు హక్స్లే పనితీరు మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ కుక్కపిల్ల కళాత్మకంగా వేసిన పెయింటింగ్ నైపుణ్యాలను ఎంతోమంది ప్రశంసింస్తున్నారు. ఈ కుక్క నుంచి పెయింటింగ్ నేర్చుకుంటానని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ పెయింటింగ్ టీచర్‌ను చాలామంది అనుసరించాలని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. మరికొంతమంది మాత్రం కామెంట్స్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలతో చాట్ చేస్తున్నారు. ఈ పికాసో కుక్కపిల్లను ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలని ఒక యూజర్ రాశాడు. కుక్కల్లో కూడా కళాకారులు ఉంటారని ఈ వీడియో ద్వారా తెలుస్తోందని చాలామంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

  First published:

  Tags: Dog, Social Media, Trending, Trending videos, Viral, Viral Videos