news18-telugu
Updated: July 19, 2019, 7:25 PM IST
ఇతర దేవతామూర్తులతో పాటు ప్రతిష్టించిన జయలలిత విగ్రహం
తమిళనాడు ధివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోయంబత్తూరులో ఆలయాన్ని నిర్మించారు. ఇతర దేవతామూర్తుల విగ్రహాలతో పాటు జయలలిత విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యపూజలు, కర్పూర హారతులు ఇస్తున్నారు. తద్వారా అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు తమ ‘అమ్మ’ (జయలలిత) పట్ల ఆరాధనభావాన్ని చాటుకుంటున్నారు. కోయంబత్తూరులోని 100వ వార్డులోని గణేశపురంలో మూరండమ్మల్ ఆలయం ఉంది. దీనికి ఎదురులో ఉన్న కార్పొరేషన్ యోగా కేంద్రంలో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

జయలలిత విగ్రహానికి నిత్యపూజలు, కర్పూర హారతులు
ఇప్పుడు అక్కడ జయలలిత విగ్రహాన్ని స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు ఏర్పాటు చేశారు. 8 టన్నుల బరువున్న జయలలిత విగ్రహాన్ని తయారు చేశారు. ఈ శిలపై కాలభైరవుడు, ఆంజనేయస్వామి ప్రతిమలతో పాటు జయలలిత ప్రతిమను ఏర్పాటు చేశారు.

జయలలిత విగ్రహం
స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జయలలిత విగ్రహాన్ని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.
Published by:
Janardhan V
First published:
July 19, 2019, 7:25 PM IST