Vanitha Vijaykumar: ఒకటి, రెండు కాదు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఎవరితోనూ పెద్దగా ఇమడలేకపోయింది. మరొకరితో రిలేషన్‌లో ఉన్నా.. అది ఎక్కువ రోజులు నిలవలేదు. సినిమాల్లో ఆమె పాత్ర ఒక వ్యక్తి ప్రేమకు పరిమితమైనప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నిరంత ప్రేమపక్షిలా మారింది. ఆమె ఎవరో కాదు నటి వనితా విజయ్‌కుమార్. ఈ నటి ఇప్పుడు ఐదోసారి ప్రేమలో పడింది. ఈ విషయం మరెవరో కాదు వనితానే వెల్లడించింది. తన ఇన్‌స్టాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టిన వనితా అందులో.. మళ్లీ ప్రేమలో పడ్డా. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా అని నటి ఉమా రియాజ్ ఖాన్‌ని ట్యాగ్ చేశారు. దీంతో ఈ సారి వనితా ఎవరితో ప్రేమలో పడిందో తెలుసుకునేందుకు ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.
అయితే ప్రముఖ సినీ దంపతులు విజయ్‌కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వనితా విజయ్‌కుమార్.. ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్‌లో పలు చిత్రాలు, సీరియల్‌లో నటించారు. ఇక 2000 సంవత్సరంలో వనితా, నటుడు ఆకాశ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరికి ముగ్గురు పిల్లలు(అబ్బాయి, కవల అమ్మాయిలు) పుట్టారు. అయితే 2007లో అతడితో విడాకులు తీసుకున్నారు వనితా. ఆ తరువాత అదే సంవత్సరం వ్యాపారవేత్త జయ్ రాజన్‌ను వనితా రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు 2012 సంవత్సరంలో విడిపోయారు. ఇక ఆ తరువాత ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు వనితా. అయితే 2017లో వీరిద్దరు విడిపోయారు. ఈ క్రమంలో తనపై వనతి లేనిపోని ఆరోపణలు చేశారని రాబర్ట్ మాస్టర్ ఓ సందర్భంలో వెళ్లడించారు. ఇక ఈ లాక్‌డౌన్ వేళ జూన్ 27న సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని ఆమె మూడో వివాహం చేసుకున్నారు.
View this post on Instagram
అయితే వీరి పెళ్లి సమయంలో పెద్ద రచ్చనే జరిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్, వనితాను పెళ్లి చేసుకున్నాడని అతడి మొదటి భార్య ఎలిజిబెత్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వనితాపై విమర్శలు చేశారు. అయితే ఈ విషయాన్ని తాము న్యాయపరంగా చూసుకుంటామని వనితా చెప్పుకొచ్చింది. అయితే పెళ్లై మూడు నెలలు కూడా అవ్వకుండానే పీటర్, వనితాను వదిలేశాడు. పీటర్‌కి తనకంటే మద్యం అంటేనే చాలా ఇష్టమని.. అతడి కోసం తాను చాలా వదులుకున్నానని.. కానీ తనను వదిలేసి వెళ్లాడంటూ వనితా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని.. పీటర్, ఎలిజిబెత్ దగ్గరకు వెళ్లి సంతోషంగా ఉన్నా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెళ్లడించింది. మరోవైపు వనితా, పీటర్‌పై ఎలిజిబెత్ వేసిన కేసులో తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. ఈ విచారణ కోసం కోర్టుకు హాజరుకావాలని ఇప్పటికే న్యాయస్థానం వనితా, పీటర్‌లకు వెళ్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Kollywood Cinema, Tollywood, Vanitha VijayaKumar