హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

డ్యాన్స్‌ షో కు జడ్జీగా సోనాలిబింద్రే.. క్యాన్సర్‌ని జయించి మళ్లీ కెమెరా ముందుకు..

డ్యాన్స్‌ షో కు జడ్జీగా సోనాలిబింద్రే.. క్యాన్సర్‌ని జయించి మళ్లీ కెమెరా ముందుకు..

Sonalibindre: యాక్టరస్ సోనాలిబింద్రే మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌తో ప్రేక్షకులకు దూరమైన నటి..ఇప్పుడు ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈనెల 11వ తేది నుంచి టెలికాస్ట్ కాబోతున్న ప్రోగ్రామ్‌ ప్రోమోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సోనాలిబింద్రే.

ఇంకా చదవండి ...

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్‌ రేంజ్ హీరోయిన్ ఆమె.. ప్రాణాంతక వ్యాధి కారణంగా తెరమరుగైపోయింది. మెటాస్టాటిక్ క్యాన్సర్‌(Metastatic cancer‌)బారినపడ్డ సోనాలి బింద్రే (Sonalibindre)ఇక కనుమరుగైపోయినట్లే అనుకున్నారు. దాదాపు మృత్యువు ముంగిట వరకూ వెళ్లిన యాక్టరస్ సోనాలి బింద్రే ప్రాణాంతక వ్యాధిని జయించి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేసింది. అదే గ్లామర్, అంతే ఉత్సాహంతో ఓ టీవీ షో (TV show) కి జడ్జిగా వ్యవహరించేందుకు మళ్లీ వస్తున్నా అంటూ షో ప్రోమోని తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌లో షేర్ చేసింది. క్యాన్సర్‌ కారణంగా సుమారు నాలుగేళ్లుగా ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉన్న సోనాలి బింద్రే డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5(Dance‌ India Dance Little Masters-5) షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. మార్చి 11 నుంచి ఈ టీవీ షో టెలికాస్ట్‌ కానుంది. బిగ్ స్క్రీన్‌ మీద కాకపోయినా ఆ ప్రోగ్రామ్‌తో స్మాల్ స్క్రీన్‌పై కనిపించనుంది. నాలుగేళ్ల తర్వాత సోనాలి మళ్లీ ఇలా జనం మధ్యకు రావడం ఇదే మొదటిసారి. ప్రోమోలో ఏమాత్రం ప్రాణాంతక వ్యాధితో నాలుగేళ్లు మృత్యువుతో పోరాడినట్లుగా కనిపించకుండా ఎంతో జాలీగా, హ్యాపీగా కనిపించింది సోనాలి బింద్రే.ఈ నాలుగేళ్లకాలంలో జీవితం విలువ తెలిసిందని సోనాలి బింద్రే భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ని షేర్ చేసుకుంది. క్యాన్సర్‌ వల్ల శారీరికంగానే కాదు మానసీకంగానూ తనలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పింది. క్యాన్సర్ రోగం జయించడం అంతే అంత ఆషామాషి విషయం కాదు. కేవలం 30శాతమే బ్రతికే అవకాశముందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా మనోధైర్యంతో మృత్యువుతో పోరాడింది సోనాలి బింద్రే. 2018లో క్యాన్సర్‌ బారినపడ్డ విషయాన్ని స్వయంగా తానే అందరికి షేర్ చేసుకుంది. సోనాలి బింద్రే త్వరగా రికవరీ కావాలని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు.

స్మాల్ స్క్రీన్‌పై రీఎంట్రీ ..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ఇంద్రాలో నటించింది సోనాలి బింద్రే. మురారి సినిమాలో మహేష్‌బాబుతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్‌కి ప్రియురాలిగా కాసేపు కనిపించి చనిపోతుంది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా తన అద్భుత నటనతో మెప్పించిన సోనాలి బింద్రే కెరియర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే క్యాన్సర్‌ బారినపడింది. సోనాలి బింద్రేనే కాదు సెలబ్రిటీలు ఎంతో మంది క్యాన్సర్ బారినపడ్డారు. అందులో కొందరు రికవరీ అయ్యారు. ముఖ్యంగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సోనాలిబింద్రేతో పాటు మనిషా కోయిరాలా కూడా క్యాన్సర్‌ బారినపడింది. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ సైతం ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న వారిలో ఉన్నారు.

మృత్యువును జయించిన సోనాలి..

గ్లామర్ ప్రపంచంలో ఓ స్టార్ హీరోయిన్‌ సోనాలిబింద్రే ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలవడం వరల్డ్ రికార్డ్‌ సొంతం చేసుకున్నట్లుగా ఉందన్నారు సోనాలిబింద్రే. ఇక తాను జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్‌ ఎంతో ఎక్సైజ్‌మెంట్‌గా ఉందని..తాను కూడా సుమారు 14-15గంటల పాటు ఆడిషన్‌లో పాల్గొన్నానని..చెప్పింది. క్యాన్సర్‌ కారణంగా పోగొట్టుకున్నజుట్టు, ఆరోగ్యం అన్ని తిరిగి పొందడమే కాకుండా హై హిల్స్‌పై నిల్చొని పూర్తిగా ఆరోగ్యంగా ఇలా మీ ముందు మాట్లాడటం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని నా జీవితంలో ఇలాంటి రోజులు మళ్లీ తిరిగి వస్తాయని అనుకోలేదని తన సంతోషాన్ని వెల్లడించింది సోనాలి బింద్రే.

First published:

Tags: Instagram, Sonali Bendre

ఉత్తమ కథలు