సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీలపై పుకార్లు రావడం చాలా కామన్. ముఖ్యంగా టాలీవుడ్(Tollywood)కి చెందిన ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్(Music director)దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)కి పెళ్లైపోయిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ హీరోయిన్నే (Actress)సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే సదరు సంగీత దర్శకుడు బ్యాచిలర్ కావడం, పెళ్లి చేసుకున్నారని చెబుతున్న హీరోయిన్ నేటివ్ ప్లేస్ ఆంధ్రా కావడంతో పుకార్లు కాస్తా షికార్లు చేస్తున్నాయి. దీనిపై టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్పందించకపోయినప్పటికి హీరోయిన్ మాత్రం ఖండించింది. ఓ మూవీ ప్రమోషన్ కోసం యూట్యూబ్ చానల్(YouTube channel)కి ఇచ్చిన ఇంటర్యూ(Interview)లో పెళ్లి గిళ్లీ లేదని పుకార్లను కొట్టిపారేసింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదన్న నటి ఇకపై మానుకుంటే మంచిదని సెలవిచ్చింది.
దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై పుకార్లు..
టాలీవుడ్లో అద్భుతమైన మ్యూజిక్‌తో క్రేజీ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవీశ్రీప్రసాద్కి పెళ్లి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కి చెందిన హీరోయిన్ పూజిత పొన్నాడను సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పుకార్లను హీరోయిన్ పూజిత పొన్నాడ ఖండించారు. దేవీశ్రీప్రసాద్‌తో తనకు ఎవరితో పెళ్లి కాలేదని ..ఎవరితో రిలేషన్షిప్లో లేనని తేల్చి చెప్పింది. తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్ కోసం యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ సీక్రెట్ మ్యారేజ్‌పై జరుగుతున్న ప్రచారానికి తెర దింపింది పూజిత పొన్నాడ.
అంతా తూచ్ అంటున్న హీరోయిన్..
ఊపిరి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత రంగస్థలం, హ్యాపీ, వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్, ఆకాశ వీధుల్లో అనే చిన్న సినిమాల్లో యాక్ట్ చేసింది. అచ్చు తెలుగమ్మాయిలా ఉండే పూజిత తనపై ఎందుకు ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని..దయచేసి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు పూజిత పొన్నాడ.
పుకార్లు మానుకోవాలని సూచన..
పూజిత పొన్నాడ స్వస్థలం వైజాగ్. షార్ట్ ఫిల్మ్స్, చిన్న సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్లో .యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌పై గతంలో కూడా ఇలాంటి రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాతగా ఉన్న చార్మి, హీరోయిన్ శ్రద్దాదాస్‌తో ప్రేమలో ఉన్నాడని...పెళ్లి కూడా చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అవన్నీ అబద్ధమని తేలిపోవడంతో ..చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈవిధమైన పుకార్లు మళ్లీ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.