Kangana Ranaut: ఐపీఎస్ రూప‌పై కంగనా ఫైర్.. సస్పెండ్ చేయాలని డిమాండ్

దీపావళి సందర్భంగా ఐపీఎస్ అధికారిణి డి రూప చేసిన  ట్వీట్‌‌పై వివాదం రగులుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

news18-telugu
Updated: November 19, 2020, 7:50 PM IST
Kangana Ranaut: ఐపీఎస్ రూప‌పై కంగనా ఫైర్.. సస్పెండ్ చేయాలని డిమాండ్
కంగనా రనౌత్, ఐపీఎస్ రూప
  • Share this:
దీపావళి సందర్భంగా ఐపీఎస్ అధికారిణి డి రూప చేసిన  ట్వీట్‌‌పై వివాదం రగులుతూనే ఉంది. కర్ణాటక ప్రభుత్వం హోం సెక్రటరీగా ఉన్న రూప.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి టపాసులపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తూ ట్విటర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. టపాసుల నిషేధం విధించడం వల్ల హిందువుల విషయంలోనే ఇలా జరుగుతుందని కొందరు అనుకుంటున్నారని.. కానీ అసలు హిందూ పురాణాల్లో టపాసుల ప్రస్తావనే లేదని ఆమె ట్వీట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టపాసుల నిషేధంపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం సరైదని కాదని ఆగ్రహం చేస్తూ.. ఆమెపై ట్విటర్ వేదికగా నిరసన తెలిపారు. అంతేకాకుండా "షేమ్‌ఆన్‌యూ ఐపీఎస్ రూప" అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా డి రూప‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూప వంటి అధికారులు పోలీసు ఫోర్స్‌లో ఉండటం సిగ్గుచేటు అని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్విటర్ వేదికగా ఆమెపై నిప్పులు చెరిగారు. "ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ప్రభుత్వం డి రూప లాంటి ఐపీఎస్ అధికారులను నియమిస్తుంది. కానీ ఆమెను చూడండి.. ప్రాథమిక హక్కులను కాపాడటంలో విఫలమైంది. ఆమె తన వాదనలకు సరైన ఆధారాలు చూపించలేకపోయింది. రిజర్వేషన్ల దుష్ప్రభావం వల్ల అర్హతలేని వ్యక్తుల చేతిలోకి అధికారం వెళితే వాళ్లు ప్రజలను బాధిస్తారు. నాకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. కానీ ఆమె అసమర్థత నుంచి ఆమె నిరాశ బయట పడుతుందని నేను కచ్చితంగా చెప్పగలను.







ప్రజలు కట్టే పన్నుల మీద జీవించే పోలీసులు.. సామాన్య ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ ప్రజల ఫిర్యాదు తీసుకుని వారికి సహాయం చేయాల్సిన వారు ఎలా వ్యవహరిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న. రూప విధుల్లో ఉన్నప్పుడు ట్రోలింగ్ వంటి విషయాల్లో ఎందుకు పాలుపంచుకుంటుంది. అది కూడా యువతను బెదిరించేలా.."అని కంగనా పేర్కొన్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 19, 2020, 7:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading