అమ్మాయి మరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. అమలా పాల్ సంచలనం..

Amala Paul: సినిమా ట్రైలర్‌లో అమలా పాల్.. వీజే రమ్యను ముద్దు పెట్టుకుంటున్న సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దాన్ని చూసిన వాళ్లంతా ఆ సినిమా లెస్బియన్, గే సినిమా కావచ్చేమోనని కూడా అనుకున్నారు. ఆ రూమర్లు ఆ నోటా.. ఈ నోటా.. పాకి ఆమె చెవిలో పడింది.

news18-telugu
Updated: July 17, 2019, 10:05 PM IST
అమ్మాయి మరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. అమలా పాల్ సంచలనం..
‘ఆమె’లో అమలా పాల్ (యూ ట్యూబ్ చిత్రం)
  • Share this:
అమలా పాల్.. కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ. తాను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పి నోరెళ్లబెట్టేలా చేసే ఈ నటి.. ఆడై (తెలుగులో ఆమె) చిత్రంతో బిజీ బిజీగా ఉంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దానికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసి చిత్ర పరిశ్రమలను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ అందాల భామ.. చిత్రానికి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ప్రచారం సాధించి పెట్టడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. సినిమా ట్రైలర్‌లో అమలా పాల్.. వీజే రమ్యను ముద్దు పెట్టుకుంటున్న సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దాన్ని చూసిన వాళ్లంతా ఆ సినిమా లెస్బియన్, గే సినిమా కావచ్చేమోనని కూడా అనుకున్నారు. ఆ రూమర్లు ఆ నోటా.. ఈ నోటా.. పాకి ఆమె చెవిలో పడింది.

దీంతో, ముద్దు సీన్‌పై వివరణ ఇచ్చింది. లెస్బియన్ సబ్జెక్టు సినిమా కాదని, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, రమ్యతో ముద్దు సీన్ ఎందుకు అని ప్రశ్నించగా.. ఒక అమ్మాయిని మరో అమ్మాయి ముద్దు పెట్టుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. అది షాట్‌లో భాగమని, స్క్రిప్టులో కావాలని రాసిన సన్నివేశం కాదని తెలిపింది. సినిమాలో తమ ఇద్దరి మధ్య ఎలాంటి లైంగిక సంబంధం ఉండదని అమలా పాల్ తేల్చి చెప్పింది. సినిమా చూశాక అన్నీ అర్థం అవుతాయని చెబుతూనే, తాను స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే నగ్నంగా నటించానని చెప్పిందీ భామ.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...