అందరూ చూస్తుండగానే ఓ శివుడు కుప్పకూలిపోయాడు. సాక్షాత్తు మహాశివుడిLord Shiva వేషం వేసుకున్న ఓ కళాకారుడు వేదికపై నాటిక జరుగుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి శివుడి రూపంలో ఉన్న కళాకారుడికి హారతి ఇస్తుండగానే వెనక్కిపడిపోయాడు. ఉత్తరప్రదేశ్ Uttar Pradeshలో జరిగిన ఈసంఘటన అక్కడున్న వాళ్లనే కాదు అందర్ని షాక్‌కి గురి చేసింది. దేవుడి వేషంలో ఉన్న వ్యక్తి చనిపోయిన తీరు చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు. మరికొందరు ఆ మహాశివుడే తన దగ్గరకు ఈ కళాకారుడ్ని పిలిపించుకున్నాడేమోనని వేదాంత ధోరణిలో మాట్లాడుకుంటున్నారు. ఓ కళాకారుడు నాటకం ప్రదర్శిస్తూ చనిపోయిన వీడియో(Video)మాత్రం సోషల్ మీడియా(Social media)లో విపరీతంగా వైరల్(Viral)అవుతోంది.
కళాకారుడికి హార్ట్ ఎటాక్ ..
ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ కొత్వాలి ప్రాంతంలోని బెలాసిన్ గ్రామంలో రాంలీలా నాటిక జరుగుతోంది. ఆ నాటకంలో శివుడి పాత్ర వేశాడు రామ్ ప్రసాద్ పాండే అనే కళాకారుడు. నాటిక జరుగుతోంది...అందులో భాగంగానే శివుడి గెటప్‌లో ఉన్న రామ్ ప్రసాద్ పాండేకి హారతి ఇస్తుండగానే నిల్చున్న వ్యక్తి వెనక్కు పడిపోయాడు. వెంటనే ప్రదర్శనకు వచ్చిన వాళ్లు, నాటకంలోని మిగిలిన పాత్రధారులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. శివుడి వేషం వేసిన రామ్ ప్రసాద్ పడిపోయిన వెంటనే గుండె పోటుతో చనిపోయాడని తేల్చారు.
పాత్ర పోషిస్తుండగానే పోయిన ప్రాణం..
బెలాసిన్ గ్రామంలో గత యాభై ఏళ్లుగా రాంలీలా ప్రదర్శన చేస్తున్నారు. ఈ నాటకంలో రామ్ ప్రసాద్ పాండే గత ఐదేళ్లుగా తన కళాప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. నాటికలో అన్నీ పాత్రలు పోషించే రామ్ ప్రసాద్ పాండే సోమవారం రాత్రి శివుడి అవతారమెత్తాడు. ఈ నాటిక చూడటానికి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. సోమవారం కూడా అదే విధంగా చాలా మంది వచ్చారు. అయితే ఊహించని విధంగా నాటకం ప్రదర్శిస్తుండగానే కళాకారుడు కుప్పకూలిపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగిపోయింది. అయితే నాటక ప్రదర్శనను గ్రామానికి చెందిన వ్యక్తులు తమ ఫోన్లో వీడియో తీయడంతో ఈ లైవ్ డెత్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttar pradesh, Viral Video