మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉంటాయి. అయితే అవి అందరి దృష్టిలో పడినా ప్రయోజనం ఉండదు. ఎవరి కంట్లో పడితే వాటికి గుర్తింపు వస్తుందో అలాంటి వారి కళ్లలోనే పడాలి. సోషల్ మీడియాలో ఓ మహిళ పాట ఇప్పుడు వైరల్(Viral)గా మారింది. ఆమె గాత్రం ఎంత మధురంగా ఉందంటే ఇంట్లో రొట్టెలు చేస్తూ పాడిన పాట సినిమా నటుడు సోనూసూద్ ఎంతో ఇష్టపడే విధంగా ఉంది. అంతే కాదు ఆ మధుర గాయని ఎవరో వివరాలు తనకు కావాలంటూ .ఆమె నెంబర్ తనకు పంపించమని సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ పెట్టాడు. అంతే కాదు ఆమెకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు రియల్ హీరో సోనూ సూద్(Sonu Sood).
సాధారణ మహిళకు సింగర్‌గా గుర్తింపు..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడో మారు మూల గ్రామాల్లో ఉండే వాళ్లు. టాలెంట్ ఉండి అందరికి పరిచయం కాని చాలా మంది పాపులర్ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా ఓ మహిళ ఇప్పుడు అంతే ఫేమస్ అయింది. వీడియోలో 25-30ఏళ్ల వయసున్న మహిళ 1970లో వచ్చిన మెహబూబా అనే హిందీ సినిమాలోని మేరే నైనా సావన్ భదోన్ అనే పాటను పాడింది. నాడు మధురగాయని లతామంగేష్కర్ ఆలపించిన పాటను సేమ్ టు సేమ్ పాడింది ఈ మహిళ. ఈ వీడియో సామాజిక మాధ్యమం ద్వారా నటుడు సోనూసూద్‌కు చేరింది. అంతే ఇంత బాగా పాటలు పాడుతున్న మహిళ సినిమాల్లో పాడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు రియల్ హీరో సోనూసూద్.
नंबर भेजिए माँ फ़िल्म के लिए गाना गाएगी ❤️ https://t.co/rLebxFRhWX
— sonu sood (@SonuSood) January 27, 2023
వైరల్ అవుతున్న వీడియో ..
ఇంట్లో పని చేసుకుంటూ సరదాగా ఓ పిల్లవాడు పాట పాడమని కోరడంతో మహిళ ఓల్డ్ సాంగ్‌ని అద్భుతంగా పాడింది. అందుకే ఇప్పుడు ఆ మహిళ పాడిన పాట విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి తోడు నటుడు సోనూ సూద్ సైతం ఆమె పాటను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే సోనూసూద్ మాత్రం ఈ పాట పాడిన మహిళ వివరాలు తనకు కావాలని ఆమె సినిమాల్లో పాటలు పాడితే బాగుంటుందని..ఆ అవకాశం కూడా కల్పిస్తానంటూ ఆమె నెంబర్ తెలిస్తే ఎవరైనా పంపమని కామెంట్ పోస్ట్ చేశాడు.
టాలెంట్‌ని ప్రోత్సహించిన సోనూసూద్..
కరోనా టైమ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఉపాధి కోసం, వైద్యం కోసం ఆర్ధికంగా సాయం చేసిన సోనూ సూద్ మొదటి సారి ఓ మహిళలోని టాలెంట్‌ని గుర్తించి సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తానని చెప్పడంతో నెటిజన్లు మరోసారి అతడ్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sonu Sood, VIRAL NEWS, Viral Video