హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bihar:ఒంటికాలుతో స్కూల్‌కి వెళ్తున్నబాలిక..రెండు కాళ్లతో పరిగెత్తేలా చేస్తానన్న సోనూసూద్

Bihar:ఒంటికాలుతో స్కూల్‌కి వెళ్తున్నబాలిక..రెండు కాళ్లతో పరిగెత్తేలా చేస్తానన్న సోనూసూద్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Bihar:బీహార్‌కి చెందిన 10సంవత్సరాల బాలిక సీమకు ఆత్మస్థైర్యం ఎక్కువ. అంతకు మించిన పట్టుదల ఆమెలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు రెండు కాళ్లలో ఒక కాలు తొలగించారు డాక్టర్లు.బాలిక ప్రాణాలు కాపాడటానికి కాలు తీసేయడం వల్లే ఒంటి కాలుతోనే గడుపుతూ వచ్చింది. స్కూల్‌కి వెళ్లడం, ఇంట్లో పనులు చేయడం అన్నీ పనులు ఒంటి కాలుతో చేస్తూ వచ్చింది. సీమ ఇన్నేళ్లుగా పడుతున్న ఇబ్బంది ఇప్పుడు తొలగిపోయింది.

ఇంకా చదవండి ...

బీహార్‌ (Bihar)రాష్ట్రం జముయి జిల్లాలోని ఖైరా(Khaira) పరిధిలోని ఫతేపూర్‌(Fatehpur)  గ్రామానికి చెందిన దళిత కుటుంబంలో జన్మించింది సీమా. ప్రస్తుతం 10సంవత్సరాల వయసున్న బాలికకు రెండేళ్ల క్రితం ఒక కాలు పోయింది. దాంతో వికలాంగురాలిని అనే బాధను మనసులో పెట్టుకొని కుమిలిపోకుండా తాను ఓ ఉపాధ్యాయురాలి(Teacher)ని కావాలనే తపన, పట్టుదలతో చదువుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్‌ ఇంటి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికి పుస్తకాల బ్యాగ్‌(Bag)ని భుజాన వేసుకొని ఒంటికాలుతో గెంటుకుంటూ వెళ్తోంది. అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్లు కుంటి సాకులతో స్కూల్, కాలేజీలు ఎగ్గొట్టి తిరుగుతున్న ఈ రోజుల్లో ఓ దళిత కుటుంబంలో పుట్టిన బాలిక అందులో వికలాంగురాలు(Disabled )చదువుపై శ్రద్ధతో ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకోవాలని అలా ఒంటి కాలుతోనే స్కూల్‌కి వెళ్లడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

పదేళ్ల పంతులమ్మ..

ఫతేపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాల్గోవ తరగతి చదువుతున్న సీమా యాక్సిడెంట్‌ కారణంగా కాలు పోగొట్టుకున్నప్పటికి కృత్రిమ కాలు అమర్చడం, ప్రజాప్రతినిధులు కనీసం ట్రైసైకిల్, లేదంటే ఆర్ధిక సాయం వంటివి చేయలేదు. సీమా తల్లిదండ్రులు కూలీ పని చేసుకునే వారు కావడంతో ఆమెకు కృత్రిమ కాలు అమర్చే ప్రయత్నం చేయలేకపోయారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు, తన శారీరక నిస్సహాయతను ఏమాత్రం మదిలో పెట్టుకోకుండా సీమా తోటి విద్యార్ధులతో కలిసి రోజూ స్కూల్‌కు వెళ్తోంది.


రియల్‌ హీరో సాయం..

పదేళ్ల వయసులో కాలు లేకపోవడం..నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల అయినప్పటికి ధైర్యంగా చదువుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్థానికులు అభినందించారు. అయితే పదేళ్ల బాలిక స్కూల్‌కి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే బాలిక పట్ల పెద్ద మనసు చేసుకున్నారు సినీ నటుడు సోనూసూద్‌. కరోనా కష్టకాలంలో, అంతకు ముందు అడగకుండానే ఎందరికో సాయం చేసిన ఈ రియల్ హీరో సీమాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇప్పటి వరకు ఒంటి కాలుతో నడిచిన సీమా ఇకపై రెండు కాళ్లతో నడుస్తూ స్కూల్‌కి వెళ్తందని ట్వీట్ చేశారు. అంతే కాదు టిక్కెట్టు పంపుతున్నాను అంటూ తన గొప్ప మనుసును మరోసారి చాటుకున్నారు సోనూసూద్.

First published:

Tags: Bihar News, Sonu Sood, Viral Video

ఉత్తమ కథలు