Home /News /trending /

ACTOR SONU SOOD HELPS 7 MONTH OLD FROM KARIMNAGAR WITH LIVER TRANSPLAN SURGERY KNR

Sonu Sood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. ఏడేళ్ల చిన్నారికి..

చిన్నారితో బాధిత కుటుంబం..

చిన్నారితో బాధిత కుటుంబం..

Karimnagar: బాలీవుడ్ హీరో సోనుసూద్ ఏడునెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. దీనికోసం నిర్వహించిన శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తయింది.

సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోను రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆయన కోవిడ్ సమయలో ఎందరో అభాగ్యులకు ఆపాన్న హస్తం అందించారు. ఇతర రాష్ట్రాల నుంచి మన దేశానికి వచ్చిన వలస కార్మికులు కోవిడ్ లాక్ డౌన్ వలన చిక్కుకుపోయారు. దీంతో ప్రత్యేక చొరవ తీసుకుని, స్పెషల్ వాహనాలను ఏర్పాటు చేసి, వారి గమ్యస్థానాలకు వెళ్లేలా తోడ్పాటు అందించారు.

అదే విధంగా.. ఎంతో మందికి ఉపాధి కోల్పోయిన వారికి కూడా ఉద్యోగాలను ఇప్పించారు. ఆహరం, ఉండటానికి వసతులు, అన్నిరకాల ఏర్పాట్లుచేశారు. అంతే కాంకుండా పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి, వాటి ట్రీట్ మెంట్ చేయించడానికి ఖర్చు చేయలేని వారికి సైతం సోను సూద్ ఫ్రీగా వైద్యం అందించారు. ఈ క్రమంలో అనేక మంది ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే, తాజాగా, సోనుసూద్ మరోసారి వార్తలలో నిలిచారు.



పూర్తి వివరాలు.. తెలంగాణాలోని (telangana)  కరీంనగర్ జిల్లాకు (karimnagar) చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ సఫన్ అలీ కి చెందిన 7 నెలల చిన్నారికి లివర్ సంబంధిత సమస్య ఏర్పడింది.దీనికి ట్రీట్ మెంట్ చేయడానికి వారి వద్ద అంత స్థోమత లేదు. ఈ క్రమంలో వారు.. సోనుసూద్ ను కలసి తమ గొడును చెప్పుకున్నారు. దీనికి స్పందించిన సోనుసూద్ .. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తానని తెలిపారు.

ఆయన అన్నట్లుగానే బాధిత కుటుంబాన్ని కేరళలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొచ్చిలోని ఆస్టర్ మెడ్సిటీ ఆసుపత్రిలో చిన్నారికి వైద్యసేవలు అందించారు. అక్కడ శస్త్రచికిత్స కూడా విజయవంతంగా ముగిసింది. చిన్నారి ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లిదండ్రులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారి చికిత్స విజయవంతం కావడంపై సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు .

ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.

హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.

దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Karimnagar, Sonu Sood, Telangana, VIRAL NEWS

తదుపరి వార్తలు