Video : రెండు అరటిపండ్లు రూ.442... బిల్లు చూసి షాకైన బాలీవుడ్ నటుడు

Video : రాహుల్ బోస్ రెండు అరటిపండ్లకు ఆర్డరిచ్చాడు. ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చిన బిల్లు చూసి మైండ్ బ్లాంకైంది. ఛండీఘడ్‌లో జరిగిన ఈ ఘటనపై ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 24, 2019, 12:27 PM IST
Video : రెండు అరటిపండ్లు రూ.442... బిల్లు చూసి షాకైన బాలీవుడ్ నటుడు
రెండు అరటిపండ్లు రూ.442
  • Share this:
ఇప్పుడున్న రేట్ల ప్రకారం డజను అరటిపండ్లు రూ.50 నుంచీ రూ.100 లోపే ఉంటున్నాయి. అలాంటిది ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో మాత్రం జస్ట్ రెండు అరటి పండ్లకు రూ.442 బిల్లు వేశారు. అవి చక్కరకేళీయో, ఇంకే ప్రత్యేక రకమో కాదు. సాదా సీదా అరటిపండ్లే. నటుడు రాహుల్ బోస్... ఈమధ్య ఛండీగఢ్‌లోని హై-ఎండ్ లగ్జరీ హోటల్‌కు వెళ్లాడు. జిమ్ చేస్తూ... రెండు అరటిపండ్లకు ఆర్డరిచ్చాడు. వెయిటర్ ఓ ప్లేటులో రెండు అరటిపండ్లు తెచ్చి... బిల్లుతో సహా హోటల్ రూంలో ఉంచాడు. జిమ్ తర్వాత బనానాస్ తిందామని తన రూంలోకి వెళ్లాడు రాహుల్. బిల్లు ఏ ఇరవయ్యో, ముప్పయ్యో ఉంటుందనుకున్నాడు. తీరా చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాయి. దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే బిల్లు రూ.442 ఉంది. అసలు ఎలా స్పందించాలో కూడా అతనికి అర్థం కాలేదు. వాటిని వీడియో తీసి... ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.


అరటి పండ్ల రేటుపై అసహనం వ్యక్తం చేసిన రాహుల్ బోస్... పండ్లు మనకు ప్రమాదం కాదని ఎవరన్నారు? ఈ బిల్లు చూస్తే ఎవరికైనా పండ్లు హానిచేయవని అనిపిస్తుందా? అని నెటిజన్లను అడిగాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా ఆ హోటల్‌పై మండిపడుతున్నారు.




పండ్లపై GST, UTGST ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా... ఇదో రుచికరమైన చోరీ అని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ఇంకా చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>