రోడ్డుపై షాకింగ్ సీన్... జింకను చుట్టుకున్న కొండచిలువ... వైరల్ వీడియో...

రోడ్డుపై జింకను చుట్టుకున్న కొండచిలువను చూసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆ క్షణం అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు? అది సరైన నిర్ణయమేనా?

news18-telugu
Updated: June 6, 2020, 1:26 PM IST
రోడ్డుపై షాకింగ్ సీన్... జింకను చుట్టుకున్న కొండచిలువ... వైరల్ వీడియో...
రోడ్డుపై షాకింగ్ సీన్... జింకను చుట్టుకున్న కొండచిలువ... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:


పులి... జింకను వేటాడుతుంటే... మనం ఏమనుకుంటాం. ఆ జింక తప్పించుకుంటే బాగుండు అనుకుంటాం. చాలా సందర్భాల్లో జింక దొరికిపోతుంది. పులికి ఆహారం అవుతుంది. అప్పుడు మనం ఇంకోలా అనుకుంటాం. అది ప్రకృతి ధర్మం... పులి ఆహారం జింక కాబట్టి... అది అంతే అనుకుంటాం. ఇలాంటి పరిస్థితే... నడి రోడ్డుపై కనిపించింది. అది థాయిలాండ్‌లోని ఖావ్ ఖియో ఓపెన్ జూ. ఆ జూలో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఇంతలో రోడ్డుపై ఓ కొండ చిలువ... జింకను తినబోతూ... దాన్ని చుట్టుకొని కనిపించింది. జింక కుయ్యో మొర్రో అంటుంటే... అతనికి కాళ్లూ చేతులూ ఆడలేదు. చూస్తూ చూస్తూ... జింకను ఎలా వదిలేసేది అనుకున్నాడు. దాన్ని కాపాడాలి అని డిసైడ్ అయ్యాడు. ఓ సన్న కొమ్మ లాంటిది తెచ్చి... పామును బెదిరించాడు. దాంతో... పాము ఏకాగ్రత దెబ్బతింది. పట్టు సడలింది. అదే సమయంలో... జింక కూడా బలంగా ట్రై చేసి... పాము నుంచి పక్కకు జారి పారిపోయింది. పాము తుప్పల్లోకి వెళ్లిపోయింది.ఈ వీడియో చూసిన తర్వాత మన లాగే నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో... అతను చేసిం కరెక్ట్ అంటున్నారు. ఆ జింకకు ప్రాణం పోశాడు అంటున్నారు. కొందరేమో... కొండచిలువ ఆహారాన్ని దానికి దూరం చేశాడు అంటున్నారు. నిజం చెప్పాలంటే రెండూ రైటే. మనుషులుగా మనం... మానవత్వాన్ని చాటుతాం. మన కళ్లముందు ఏదైనా ప్రాణి ప్రమాదంలో ఉంటే... దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. అది మన దయాగుణం.మరోవైపు ప్రకృతి కొండచిలువకు సహజ సిద్ధంగా ఇచ్చిన లక్షణం... ఇలా జంతువుల్ని గుడుక్కుమనిపించే గుణం. జింక మొత్తాన్నీ మింగి... ఆ కొండ చిలువ ఏ చెట్టుకో చుట్టుకుంటుంది. దాంతో... జింక ఎముకలన్నీ విరిగిపోయి... అరగిపోవడం మొదలవుతుంది. ఇలా ఓ మూడ్రోజుల్లో జింక పూర్తిగా ఆహారం అవుతుంది. అది ప్రకృతి ధర్మం.

ఇలా రెండు కోణాలనూ బలపరుస్తూ ఉన్న ఈ వీడియోని మే 30 నుంచి ఇప్పటివరకూ 27 లక్షల మంది చూశారు. 17 వేల మంది లైక్ చేశారు. 61 వేల మంది రీట్వీట్ చేశారు. 703 మంది కామెంట్స్ చేశారు. ఈ లిస్టులో మనం కూడా చేరిపోయాం.
Published by: Krishna Kumar N
First published: June 6, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading