హోమ్ /వార్తలు /trending /

ఆక్వామెన్ కలెక్షన్ల సునామీ : ప్రపంచవ్యాప్తంగా రూ.7000కోట్లు వసూలు

ఆక్వామెన్ కలెక్షన్ల సునామీ : ప్రపంచవ్యాప్తంగా రూ.7000కోట్లు వసూలు

ఆక్వామెన్(File)

ఆక్వామెన్(File)

Acquaman World Wide Collections | జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్యాట్రిక్‌ విల్సన్‌, జాసన్‌ మెమోవా, అంబర్‌ హియర్డ్‌‌‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఏడు రాజ్యాల మధ్య జరిగే యుద్ధ ఇతివృత్తంతో సినిమాను తెరకెక్కించారు.

ఇంకా చదవండి ...

  వార్నర్‌ బ్రదర్స్‌, డిస్నీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన 'ఆక్వామెన్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది.జేమ్స్ వాన్ దర్శకత్వంలో డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్లలో 1 బిలియన్ డాలర్ మార్క్‌(రూ.7000కోట్లు)ను చేరింది.


  చైనాలో తొలివారంలోనే రూ.670కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా.. నార్త్ అమెరికాలో మూడు వారాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ రోన్ సాండర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.


  ఆక్వామెన్ చిత్రానికి ప్రపంచ ప్రేక్షకుల నుంచి వెల్లువెత్తుతున్న స్పందన చూసి తాము థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నామని సాండర్స్ తెలిపారు. ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఫిలిం మేకర్స్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. ఆక్వామెన్ దర్శకుడు జేమ్స్ వాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సినిమాలోని పాత్రలకు నటీనటులు జీవం పోశారని.. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.కాగా, ఆక్వామెన్ చిత్రంలో జాసన్‌ మెమోవా, అంబర్‌ హియర్డ్‌‌‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఏడు రాజ్యాల మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సినిమాలో ఉత్కంఠ భరితంగా చూపించారు.

  First published:

  Tags: Hollywood, Hollywood News

  ఉత్తమ కథలు