Home /News /trending /

AATMANIRBHARTA HAS BEEN NAMED OXFORD HINDI WORD OF THE YEAR MS

Aatmanirbharta: గతేడాది Oxford హిందీ వర్డ్ ఆఫ్ ది ఈయర్ గా ఆత్మనిర్భరత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aatmanirbharta: కోవిడ్-19 సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రధాని మోడీ ఒక సందర్భంలో ‘ఆత్మనిర్భరత’ ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

  • News18
  • Last Updated :
    గతేడాది కోవిడ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతలాకుతలమైన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రధాని మోడీ ఒక సందర్భంలో ‘ఆత్మనిర్భరత’ ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు గానూ పలు కీలకరంగాలకు కేటాయింపులు జరిగాయి. అయితే ఈ పదం గురించి చెప్పినప్పుడే దేశవ్యాప్తంగా నెటిజన్లు దీని అర్థం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు, ప్రజలు డిక్షనరీలు తిరగేశారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా దీని ప్రస్తావన వచ్చింది. అయితే ఈ పదం మరోసారి వార్తల్లోకెక్కింది. ఎందుకనుకుంటున్నారా..?

    ఆత్మ నిర్భరత (self-reliance) పదం మరోసారి వార్తల్లోకెక్కింది. గతేడాదికి గానూ ఈ పదం హిందీ పదంగా నిలిచింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఒక ప్రకటన చేసింది. ఈ సంవత్సరపు హిందీ పదంగా ఆత్మనిర్భరత ను ఎంపిక చేసింది.

    భాషా నిపుణులు కృతిక అగర్వాల్, పూనం నిగం సహే, ఇమోజెన్ ఫాక్సెల్ లు ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఈ పదానికి సాంస్కృతిక ప్రాముఖ్యం తో పాటు గాక... శాశ్వత సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటంతో ఈ యేడు ఉత్తమ పదంగా దీనిని ఎంపిక చేస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు తెలిపారు.

    కోవిడ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనప్పుడు ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఈ పదాన్ని వాడగా.. అప్పట్నుంచి జనాలు దీని అర్థం గురించి వెతికిన విషయం తెలిసిందే. తెలుగులో స్వావలంభన అని అర్థం వచ్చే ఈ పదం.. భారత్ తన స్వంత కాళ్ల మీద ఎదగాలనే అర్థాన్ని సూచిస్తుంది. ప్రధాని నోట ఈ పదం రాగానే.. అప్పట్నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ అధికారిక కార్యక్రమం చేపట్టినా.. ఏ ప్రాజెక్టు తీసుకున్నా.. దానిలో ఈ పదాన్ని వాడుతున్నది. కాగా.. తాజాగా ఈ పదాన్ని ఈ ఏడాదిలో హిందీ పదంగా ఎంపిక చేయడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శివరామర్ కృష్ణణ్ స్పందిస్తూ... ‘గతేడాది ఆత్మ నిర్భరత ప్రజల నోటిలో విస్తృతంగా ప్రచారం పొందింది. ఇది కోవిడ్-19 ఆర్థిక పునరుజ్జీవనానికి ఎంతగానో తోడ్పాటునందించింది..’ అని తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Corona, Covid-19, Nirav Modi, Pm modi

    తదుపరి వార్తలు