హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Ambidexterity : రజనీ స్టైల్.. రెండు చేతులతో రాస్తోంది.. అత్యంత అరుదైన బాలిక

Ambidexterity : రజనీ స్టైల్.. రెండు చేతులతో రాస్తోంది.. అత్యంత అరుదైన బాలిక

రజనీ స్టైల్.. రెండు చేతులతో రాస్తోంది.. అత్యంత అరుదైన బాలిక (image credit - twitter - @ravikarkara)

రజనీ స్టైల్.. రెండు చేతులతో రాస్తోంది.. అత్యంత అరుదైన బాలిక (image credit - twitter - @ravikarkara)

Ambidexterity : ఆ బాలిక టాలెంట్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. మామూలుగా రాయదు. అసలు ఆమె అలా ఎలా రాస్తుంది అనేది మన బ్రెయిన్ జీర్ణించుకోలేదు. రజనీ స్టైల్‌లో రాసే ఆమె వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ambidexterity : మీరు రజనీకాంత్ చేసిన శివాజీ సినిమా చూసే ఉంటారు. అందులోని ఓ సీన్‌లో సూపర్ స్టార్.. తన రెండు చేతులతో రెండేసి పేపర్లపై సంతకాలు చేస్తారు. అది రజనీ స్టైల్ అని చూపిస్తారు. నిజానికి అది సినిమా. అది డూపు. కానీ.. రియల్ లైఫ్‌లో అంతకు మించిన రేంజ్‌లో రాసే బాలిక మంగళూరులో ఉంది. ఆమె ఏకంగా 11 రకాల స్టైల్స్‌లో రాయగలదు. ఆమె రాస్తున్న స్టైల్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె పేరు ఆది స్వరూప (Aadi Swaroopa). కర్ణాటకలోని మంగళూరు నివాసి. ఆమె 11 రకాల స్టైల్స్‌లో రాయగలదు. రెండు చేతులతో ఒకేసారి రాయగలదు. అందులోనూ రకరకాల స్టైల్స్‌లో రాస్తుంది. ఆమె అలా రాస్తున్న వీడియోని ట్విట్టర్‌లోని @ravikarkara అకౌంట్‌లో ఫిబ్రవరి 5, 2023న పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఆ వీడియోని 32 వేల మందికి పైగా చూశారు. 1500 లైక్స్ వచ్చాయి.

శివాజీ సినిమాలో రజనీ స్టైల్ ఇక్కడ చూడండి

' isDesktop="true" id="1612440" youtubeid="Xs8cHUiS5h8" category="national">

"ఆమె బ్రెయిన్ లోని రెండు పార్టులూ ఒకే సమయంలో పనిచేయగలవు. ఇలాంటి వారు 10 లక్షల మందిలో ఒకరే ఉంటారు" అని ట్వీట్ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు రవి కర్కారా.

ఆది స్వరూప రాసే స్టైల్స్ వీడియోని ఇక్కడ చూడండి

ఈ స్కిల్‌ని యాంబీడెక్స్‌టెరిటీ (Ambidexterity) అంటారని రవి కర్కారా తెలిపారు. ఇలాంటి వ్యక్తులు.. బ్రెయిన్ లోని కుడి, ఎడమ.. రెండు పార్టులనూ ఒకేసారి వాడుకుంటూ... అనితర సాధ్యమైనవి చేస్తుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ పాప అన్ని రకాలుగా ఎలా రాయగలుగుతోందని ప్రశ్నిస్తున్నారు.

"వావ్ నమ్మలేకపోతున్నా" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "వావ్ నా ఏళ్ల నాటి టీచింగ్ కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఆమె తన జీవితంలో చాలా దూరం వెళ్తుందని ఆశిస్తున్నా" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఆమె తన జీవితంలో బాగా పైకి ఎదగాలని విషెస్ చేస్తున్నా. ఆమె నుంచి కొన్ని గొప్ప వార్తలు రావాలని ఆశిస్తున్నా" అని మరో యూజర్ కామెంట్ రాశారు. ఇలా చాలా మంది ఆమెను మెచ్చుకుంటున్నారు.

First published:

Tags: Karnataka, Trending video, Viral Video

ఉత్తమ కథలు