ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో కొత్తగా 26 భారతీయ పదాలు... అవేంటంటే...

రాన్రానూ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఇంగ్లీష్ పదాల స్థానంలో... భారతీయ పదాలు చేరి... అవి కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అయిపోతున్నాయి. మరి ఈసారి అలా చేరిన 26 కొత్త పదాలేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 25, 2020, 7:40 AM IST
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో కొత్తగా 26 భారతీయ పదాలు... అవేంటంటే...
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో కొత్తగా 26 భారతీయ పదాలు... అవేంటంటే...
  • Share this:
ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా, హర్తాళ్, షాదీ ఇవన్నీ ఇండియాలో భారతీయ పదాలు. కానీ ఇకపై ఇవి ఇంగ్లీష్ పదాలు. ఎందుకంటే... ఆక్స్‌ఫర్డ్‌ తన కొత్త ఎడిషన్‌ డిక్షనరీలో 26 భారతీయ పదాల్ని... ఇంగ్లీష్ వర్డ్స్‌గా చేర్చింది. అందువల్ల మనకు కొత్తగా 26 ఇంగ్లీష్ పదాలు వచ్చేసినట్లే. శుక్రవారమే ఈ కొత్త ఎడిషన్‌ను రిలీజ్ చేసింది ఆక్స్‌ఫర్డ్‌. ఇది పదో ఎడిషన్‌. ఇందులో 384 భారతీయ ఇంగ్లీష్ పదాలు, 1,000కి పైగా చాట్‌బోట్, ఫేక్‌ న్యూస్, మైక్రోప్లాస్టిక్‌ వంటి కొత్త పదాల్ని చేర్చింది. ఇదంతా చేస్తున్నది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (OUP). ఈ కొత్త ఎడిషన్‌ కావాలంటే... ఆక్స్‌ఫర్డ్‌ లెర్నర్స్‌ డిక్షనరీ వెబ్‌సైట్, యాప్‌‌లో లభిస్తోంది. ఇంకో మంచి విషయమేంటంటే... ఆ వెబ్‌సైట్‌లో ఆడియో-వీడియో ట్యూటోరియల్స్‌, సెల్ఫ్ స్టడీ యాక్టివిటీస్, ఐ రైటర్, ఐ స్పీకర్ టూల్స్ కూడా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లుగా ఉన్నాయి. 10వ ఎడిషన్‌లో చేర్చిన 26 కొత్త ఇండియన్ ఇంగ్లీష్ పదాల్లో 22 పదాలు మాత్రమే ప్రింటింగ్ చేసిన డిక్షనరీ బుక్‌లో ఉంటాయి. మిగతా నాలుగూ... డిజిటల్‌ వెర్షన్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఆ నాలుగూ ఏవంటే... కరెంట్, లూటర్, లూటింగ్, ఉపజిల్లా. 1942లో మొదటిసారిగా జపాన్‌లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ... ప్రింటైంది. ఆ తర్వాత 1948లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్.. దీన్ని తీసుకొచ్చింది.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు