ATM కార్డు సైజులో PVC ఆధార్.. లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా లభ్యం...

పాలీవినైల్ క్లోరైడ్ కార్డు (PVC) కార్డు రూపంలో ఉన్న ఈ ఆధార్ కార్డును మీరు ఈజీగా ఎక్కడికైనా వాలెట్ లో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. ఇందుకు మీరు మొబైల్ నంబరు రిజస్టర్ చేసుకోవాల్సిన పనికూడా లేదు.

news18-telugu
Updated: November 16, 2020, 12:48 PM IST
ATM కార్డు సైజులో PVC ఆధార్.. లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా లభ్యం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పొడవుగా ఉన్న ఆధార్ కార్డు (Adhar card) ను పట్టుకు తిరగాలంటే చాలా కష్టం. పైపెచ్చు అది చిరిగిపోయి, బోలెడు మడతలతో డ్యామేజ్ కూడా అయిపోతుంది. డూప్లికెట్ ఆధార్ (duplicate Adhar) కాకుండా ఒరిజినల్ ఆధార్ (Original Adhar) తీసుకెళ్లాలంటే ప్రతిసారీ అది మీ పర్సులో పట్టదనే బెంగ. ఇక ఈ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా UIDAI ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా అచ్చు ఏటీఎం కార్డును పోలిన ఆధార్ కార్డును మీరు కేవలం రూ.50 చెల్లించి పొందవచ్చు.

ఎప్పుడూ మీ వెంటే

పాలీవినైల్ క్లోరైడ్ కార్డు (PVC) కార్డు రూపంలో ఉన్న ఈ ఆధార్ కార్డును మీరు ఈజీగా ఎక్కడికైనా వాలెట్ లో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. ఇందుకు మీరు మొబైల్ నంబరు రిజస్టర్ చేసుకోవాల్సిన పనికూడా లేదు. రిజస్టర్డ్ మొబైల్ నంబర్ (registered mobile number) లేకుండానే ఈ కార్డును పొందగలిగే అవకాశం ఉండడంతో ఆధార్ ఉపయోగం చాలా సులువుగా మారుతుంది. అన్నిటికీ ఆధార్ తప్పనిసరి కావడంతో డెబిట్ కార్డులాంటి ఆధార్ ఉంటే ఎప్పుడూ అది మీ వెంటే ఉంటుంది.

ఆన్ లైన్లో అప్లై చేయచ్చు

లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లతో (latest security features) ఉన్న ఈ సరికొత్త ఆధార్ కార్డుకు హోలో గ్రామ్, గైలోచి ప్యాట్రన్, ఘోస్ట్ ఇమేజ్, మైక్రో టెక్స్ వంటివి ఉంటాయి. అచ్చు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సెక్యూరిటీ ఫీచర్లే దీనికి కూడా ఉంటాయి కనుక మీ ఆధార్ కు మరింత భద్రత దొరికినట్టే. ఇందుకు మీరు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరి. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, 'మై ఆధార్ సెక్షన్‌'పై క్లిక్ చేయాలి. తర్వాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరి. మీ ఆధార్ కార్డ్ పై ఉన్న 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేసి, ఓటీపీ ఎంటర్ చేసి, 50 రూపాయలు చెల్లిస్తే సరి. మీ కొత్త పీవీసీ ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్‌లో కొన్ని రోజుల్లో ఇంటికే వస్తుంది. క్యూ ఆర్ కోడ్ కూడా ఉన్న ఈ ఆకర్షణీయమైన కార్డును ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఈ సేవా కేంద్రాల్లో అయినా ఈ కార్డును పొందచ్చు. ఇది మంచి ప్రింటింగ్ క్వాలిటీ ఉండడంతో పాటు ల్యామినేషన్ కూడా బాగుంటుంది. నాన్ రెజిస్టర్డ్ మొబైల్ నంబర్ యూజర్స్ అయితే 'మై మొబైల్ నంబర్ ఈజ్ నాట్ రెజిస్టర్డ్' అన్న ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఈ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ కొత్త ఆధార్ కార్డు స్టేటస్ (Adhar card status) కూడా మీరు ట్రాక్ చేయచ్చు. UIDAI వెబ్ సైట్లో ట్రాకింగ్ (tracking) ఆప్షన్ కూడా ఉంది. 'మై ఆధార్' అని క్లిక్ చేసి, 'చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్' (check Adhar PVC card status) అని ఎంచుకుంటే మీ ఆధార్ మీ చేతుల్లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు. ఈ ఆధార్ (ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు) , ఎం ఆధార్ (మొబైల్ ఆధార్ కార్డ్), ఆధార్ లెటర్, ఆధార్ కార్డు, ఆధార్ పీవీసీ కార్డు ఇవన్నీ చెల్లుబాటు అవుతాయని గుర్తుంచుకోండి. పుకార్లను నమ్మద్దు.

ఐడీ ప్రూఫ్

ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం, కోవిడ్ టెస్ట్ కోసం, ఎయిర్ పోర్ట్, బ్యాంకుల్లో లేదా ఇతరత్రా పనులు ఏవైనా ఆధార్ తప్పనిసరి ఐడీ ప్రూఫ్ కావడంతో మరచిపోకుండా ఆధార్ కార్డును మీవెంట తీసుకెళ్లాల్సిందే. మరి ఇంత ముఖ్యమైన కార్డును పదిలంగా ఉండేలా చేయాలంటే పీవీసీ కార్డుగా మార్చుకుంటే సరిపోతుంది. మీ ఆధార్ కార్డును పీవీసీ కార్డుపై రీప్రింట్ చేసుకోవచ్చు కనుక ఈ కొత్త ఆధార్ కార్డు కోసం వెంటనే అప్లై చేయండి.
Published by: Krishna Adithya
First published: November 16, 2020, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading