Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక అడ్రస్ ప్రూఫ్ సమస్య ఉండదు

Aadhaar Card | కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ దీనిపై స్పష్టతను ఇచ్చింది. ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు కొంతకాలం వలస వెళ్తున్నవారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

news18-telugu
Updated: November 15, 2019, 12:48 PM IST
Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక అడ్రస్ ప్రూఫ్ సమస్య ఉండదు
Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక అడ్రస్ ప్రూఫ్ సమస్య ఉండదు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌కు ఆధార్ కార్డు ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వేరుగా ఉన్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అడ్రస్‌లు వేరుగా ఉండటం ఉద్యోగులకు సమస్యగా మారింది. చిరునామాలు వేరుగా ఉంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కావట్లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్రస్‌లు వేరుగా ఉన్నప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వొచ్చని చెప్పింది. ఉదాహరణకు వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేందుకు అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు ఇస్తే... బ్యాంకు సిబ్బంది లోకల్ అడ్రస్ కావాలని అడుగుతారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేర్వేరుగా ఉండటం వల్ల అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇకపై ఈ సమస్య లేదు. మీరు కేవైసీ కోసం బ్యాంకులో మీ ఆధార్ ప్రూఫ్ ఇవ్వొచ్చు. దాంతో పాటు మీ అడ్రస్ వేరుగా ఉంటే మాత్రం సెల్ఫ్-డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ రూల్స్, 2005 లో కేంద్రం సవరణ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ దీనిపై స్పష్టతను ఇచ్చింది. ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు కొంతకాలం వలస వెళ్తున్నవారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరో ప్రాంతంలో కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, బ్యాంక్ బ్రాంచ్ మార్చుకోవాలన్నా ఆధార్ కార్డులో ఒరిజినల్ అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఉద్యోగ కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారికి ఈ కొత్త నిబంధన మేలు చేస్తుంది.

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



ఇవి కూడా చదవండి:

Sabarimala Special Trains: తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ ఇవే

India Post Jobs: పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగానికి సెలెక్షన్ ప్రాసెస్ ఇదేSBI Alert: ఈ తప్పుతో మీ డబ్బులు పోతే బ్యాంకుకు సంబంధం లేదంటున్న ఎస్‌బీఐ
Published by: Santhosh Kumar S
First published: November 15, 2019, 12:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading