Aadhaar Card: మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్

Aadhaar Card | కొత్త నిబంధనల్ని చూస్తే ఆదాయపు పన్ను శాఖ రూల్స్ ప్రకారం పాన్ కార్డు తప్పనిసరైన చోట మీరు మీ ఆధార్ నెంబర్‌ను వెల్లడించినప్పుడు ఆ నెంబర్ సరిగ్గా ఉండాలి.

news18-telugu
Updated: November 13, 2019, 10:52 AM IST
Aadhaar Card: మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్
Aadhaar Card: మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పాన్ కార్డు బదులు ఆధార్ కార్డు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. అంటే పాన్ కార్డు కావాల్సిన చోటల్లా మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఇవ్వొచ్చు. ఉదాహరణకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, రూ.50,000 కన్నా ఎక్కువైన కొనుగోళ్లకు పాన్ నెంబర్ తప్పనిసరి. మీరు పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ కూడా వెల్లడించొచ్చు. అయితే ఆధార్ నెంబర్ వెల్లడించే సమయంలో ఏదైనా తప్పు చేశారంటే రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది జాగ్రత్త. ఎందుకో తెలుసుకోండి. ఫైనాన్స్ బిల్ 2019 లో ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేశారు. అందులో పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చని నిబంధనల్ని మార్చడమే కాదు... ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలని కూడా అందులో ఉంది. కొత్త నిబంధనల్ని చూస్తే ఆదాయపు పన్ను శాఖ రూల్స్ ప్రకారం పాన్ కార్డు తప్పనిసరైన చోట మీరు మీ ఆధార్ నెంబర్‌ను వెల్లడించినప్పుడు ఆ నెంబర్ సరిగ్గా ఉండాలి.

ఆధార్ నెంబర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేస్తుంది. అయితే జరిమానా విధించే అధికారం మాత్రం UIDAI సంస్థది కాదు. ఆదాయపు పన్ను శాఖ ఈ జరిమానా విధిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం పాన్ కార్డు విషయంలో చేసే తప్పులకు రూ.10,000 జరిమానా విధిస్తుంది. గతంలో ఈ జరిమానాలు పాన్ కార్డుకు మాత్రమే వర్తించేవి. ఎప్పుడైతే పాన్-ఆధార్ ఇంటర్‌ఛేంజబుల్ అంటే పరస్పర మార్పిడికి అవకాశం ఇచ్చారో... ఇక అప్పట్నుంచి ఆధార్‌కు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాన్ నెంబర్ బదులు ఆధార్ వాడే ప్రతీ చోట సరైన సమాచారం ఇవ్వకపోయినా, అవసరమైన చోట పాన్ లేదా ఆధార్ నెంబర్ ఇవ్వకపోయినా ఈ జరిమానా తప్పదు. ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోదు. మీ బయోమెట్రిక్ ఐడెంటిటీ కూడా సరిగ్గా ఉండాలి.

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

ePAN Card: గుడ్ న్యూస్... ఇక 10 నిమిషాల్లో పాన్ కార్డ్ ఉచితంగా జారీ

PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు
Loading...
PAN card: పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో రీప్రింట్‌కు రూ.50 చెల్లిస్తే చాలు
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...