Home /News /trending /

A ZOMATO SWIGGY TIE UP ON DELHI ROAD VIDEO GOES VIRAL PAH

నిజంగా గ్రేట్.. స్విగ్గీ బాయ్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

చేయిపట్టి తీసుకెళ్తున్న స్విగ్గీబాయ్

చేయిపట్టి తీసుకెళ్తున్న స్విగ్గీబాయ్

Swiggy-Zomato: స్విగ్గీ బాయ్ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. అదే మార్గంలో జోమాటో డెలివరీ బాయ్ కు కూడా వెళ్తున్నాడు. అయితే.. ఇంతలో స్విగ్గీ బాయ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంత మంది జనాలు స్వార్థంగా ఆలోచిస్తుంటారు. పక్కన వాడు బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న ఏమాత్రం పట్టించుకోరు. తమకు అవతలి వారి నుంచి ఏదైన లాభం ఉంటేనే.. ఒక అడుగు ముందుకు వేసి సహాయం చేస్తారు. లేకపోతే.. అసలు పట్టించుకోరు. కానీ కొంత మంది దీనికి భిన్నంగా ఉంటారు. జనాలు కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్లి , తమ వంతుగా సహాయం అందిస్తారు. కొన్ని సార్లు.. మూగ జీవాలు మనుషులకన్నా.. ఎన్నో రెట్ల బెటర్ గా ప్రవర్తిస్తుంటారు. తమ తోటి జీవులు కష్టాల్లో లేదా ప్రమాదంలో ఉంటే వెంటనే పరిగెత్తుకుంటు వెళ్లి సహాయం చేస్తుంటాయి.

సోషల్‌ మీడియాలో (Social media)  ప్రతిరోజున బోలేడు వీడియోలు వైరల్ (Viral video)  అవుతుంటాయి. అందులో ఎక్కువగా మనుషులు, జంతులకు సంబంధించిన కంటెంట్ ఉన్న వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం ఎమోషనల్ అయ్యేలా కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా(Viral video) మారింది.










View this post on Instagram






A post shared by Sannah Arora (@sannaharora)






పూర్తి వివరాలు.. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) జరిగింది. మనం తరచుగా ఇంటి దగ్గర ఫుడ్ కోసం స్విగ్గీ, జోమాటో (Swiggy)  ఆన్ లైన్ ఫుడ్ సంస్థలకు ఆర్డర్ పెడుతుంటాం. అయితే.. ఈ రెండు సంస్థల మధ్య ఫుడ్ డెలివరి విషయంలో, క్వాలిటీ, టైమ్ పక్చువాలిటీ మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని రోడ్డుపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. జోమాటో డెలివరీ బాయ్, తన ఆర్డర్ ఫుడ్ తీసుకుని సైకిల్ మీద వెళ్తున్నాడు. ఇంతలో అతని పక్కన ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా వచ్చాడు.

అతను.. జోమాటో డెలివరీ బాయ్ తో (Zomato) మాట్లాడాడు. ఆ తర్వాత.. అతడికి వేగంగా వెళ్లేందుకు వీలుగా.. తన చేతితో జోమాటో బాయ్ చేతిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో జోమాటో ఏమాత్రం శ్రమ లేకుండా.. స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాడు. ఈ ఘటనను కారులో వెనుకవైపు నుంచి వెళ్తున్న అరోరా అనే మహిళ తన ఫోన్ లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. స్విగ్గీ బాయ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. అతడని పొగుడుతూ.. శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Swiggy, Viral Video, Zomato

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు