హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Letter to MLA: సార్..​ నాకు అమ్మాయిలు పడటం లేదు.. మీరే గర్ల్​ఫ్రెండ్​ను చూసి పెట్టండంటూ ఎమ్మెల్యేకు లేఖ రాసిన యువకుడు

Letter to MLA: సార్..​ నాకు అమ్మాయిలు పడటం లేదు.. మీరే గర్ల్​ఫ్రెండ్​ను చూసి పెట్టండంటూ ఎమ్మెల్యేకు లేఖ రాసిన యువకుడు

ఉత్తరం రాసిన భూషణ్​

ఉత్తరం రాసిన భూషణ్​

సాధారణ జనానికి ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. అయితే అర్జీలు పరిశీలిస్తున్న ఓ ఎమ్మెల్యేకు ఓ వింత అభ్యర్థన వచ్చిందట. అయితే ఓ యువకుడు మాత్రం వింతైన ఉత్తరం (letter) రాశాడు ఆ ఏరియా ఎమ్మెల్యే గారికి.  తనను ఏ అమ్మాయి (girl) చూడటం లేదని..ఏ అమ్మాయి పడడం లేదు  కనుక ఓ గర్ల్ ప్రెండ్ (Girl friend)ను చూసి పెట్టండి మహాప్రభో అంటూ లెటర్ రాశాడు.

ఇంకా చదవండి ...

  ఎమ్మెల్యేలు (MLA) ప్రజాప్రతినిధులు. ప్రజల తరఫున ప్రభుత్వంతో మాట్లాడి తమ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేసిపెట్టేవారు. ప్రతిపక్షంలో ఉన్నట్లయితే ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేసుకుంటారు. సాధారణ జనానికి ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. మరికొంత మంది అయితే ఉద్యోగాల కోసం, ఫించన్ల కోసం, ఏదైనా స్థానిక పదవి కోసం వారికి అభ్యర్థన పెడతారు. ఎమ్మెల్యే కూడా సమయం చూసుకుని వారి అర్జీలను పరిశీలిస్తారు. అయితే ఇలా అర్జీలు పరిశీలిస్తున్న ఓ ఎమ్మెల్యేకు ఓ వింత అభ్యర్థన వచ్చిందట. అయితే ఓ యువకుడు మాత్రం వింతైన ఉత్తరం (letter) రాశాడు ఆ ఏరియా ఎమ్మెల్యే గారికి.  తనను ఏ అమ్మాయి (girl) చూడటం లేదని..ఏ అమ్మాయి పడడం లేదు  కనుక ఓ గర్ల్ ప్రెండ్ (Girl friend)ను చూసి పెట్టండి మహాప్రభో అంటూ లెటర్ రాశాడు. లెటర్​ చదివి అవాక్కవడం ఎమ్మెల్యే వంతు అయింది. ఈ ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ (viral)​గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..ఎవరా కుర్రాడు.. ఎక్కడ జరిగింది.. తెలుసుకుందాం..

  ఎవరూ చూడటం లేదంటూ..

  మహారాష్ట్ర (Maharashtra)లోని చంద్రపూర్ భూషణ్ జామువంత్ (Bhushan jamuwant) అనే యువకుడు తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని.. ఓ అమ్మాయిని చూసి పెట్టండి అని కోరుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థోతె (Subhash Dhote)కు ఓ లెటర్ రాశాడు. మ‌రాఠి (Marathi)లో రాసిన ఆ లేఖ (letter) ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. నేను వారి లవ్ (love) చేయడానికి చాలా ట్రై చేశా.. నాకు ఏ అమ్మాయి పడటం లేదు..

  ఏ అమ్మాయి ఇష్టపడడం (No girl likes) లేదు..  అసలు ఎవరూ నా వైపు చూడడం లేదు. దీంతో నాకు ఏమి తక్కువ.. ఎందుకు అమ్మాయిలు (girls) నన్ను చూడటం లేదు.. నాకు పడటం లేదు అనే ఆలోచన అధికమవుతుంది. దీంతో నాకు రోజు రోజుకీ ఆందోళన పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే నా మీద నాకే నమ్మకం (lost trust) తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నా అందుకనే మీ సాయం ఆడుతున్నా అంటూ తన ఆవేదనను మరాఠీ భాషలో వ్యక్తం చేశాడు.

  తాగుబోతులకూ లవర్స్​..

  రోజూ అల్లరిచిల్లరగా తిరుగుతూ.. మద్యం తాగుతూ.. సంపాదన లేని వారికి కూడా లవర్స్ ఉంటున్నారు. మరి నాకు ఏమి తక్కువో నాకు అర్ధం కావడం లేదు.. ఎందుకు ఏ అమ్మాయి నన్ను ఇష్ట పడటం లేదు ఎంత ఆలోచించినా తెలియడం లేదు.. అల్లరి చిల్లరిగా తిరిగే కురాళ్లకు గర్ల్స్ ఫ్రెండ్స్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటే.. వారిని చూస్తే నాకు మరింత బాధ కలుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు.

  కౌన్సెలింగ్​ ఇస్తా..

  అయితే ఈ ఉత్తరంపై ఎమ్మెల్యే సుభాష్ స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని పేర్కొన్నారు.  అంతేకాదు.. తనకు లెటర్ రాసిన యువకుడు గురించి ఆరాతీయడానికి కార్యకార్తలను రంగంలోకి దింపారు. ఆ యువకుడు కనిపిస్తే ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతేకాని.. గర్ల్ ప్రెండ్ దొరకడం లేదు అంటూ అర్ధం లేని ఆవేదన  ఆరోగ్యానికి హానికరం అంటూ కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.  ఇక ఇలాంటి అర్ధం లేని కోరికలతో ఉత్తరాలు రాయడం కరెక్ట్ కాదని అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Love, Love letter, Maharashtra, Thee young men, VIRAL NEWS

  ఉత్తమ కథలు