Shocking Video: ఇలా రోడ్డుపై నడిచి వెళుతున్నారు.. ఓ పిల్లాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడు.. తర్వాత ఏమైందంటే..

సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు

ప్రమాదవశాత్తూ ఇంట్లో ఎవరైనా కరెంట్ షాక్‌‌కు లోనైతే వెంటనే వాళ్లను నేరుగా పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకితే సాయం చేయాలనుకున్న వ్యక్తికి కూడా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదముంది. అందుకే కర్రతో గానీ, చెక్కతో గానీ ఆ షాక్ కొట్టిన వ్యక్తిని పక్కకు లాగేందుకు ప్రయత్నించాలి.

  • Share this:
    చురు: ప్రమాదవశాత్తూ ఇంట్లో ఎవరైనా కరెంట్ షాక్‌‌కు లోనైతే వెంటనే వాళ్లను నేరుగా పట్టుకుని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకితే సాయం చేయాలనుకున్న వ్యక్తికి కూడా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదముంది. అందుకే కర్రతో గానీ, చెక్కతో గానీ ఆ షాక్ కొట్టిన వ్యక్తిని పక్కకు లాగేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఘటన కరెంట్ షాక్‌కు గురైన ఓ పిల్లాడి గురించి. ఆ పిల్లాడిని కాపాడేందుకు అక్కడే ఉన్న ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో.. ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు.

    ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అదిల్ అనే ఆరేళ్ల పిల్లాడు తన స్నేహితుడైన మరో బాలుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన కరెంట్ పోల్‌ను ఆ పిల్లాడు పట్టుకున్నాడు. ఆ కరెంట్ స్తంభానికి ఉన్న వైర్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించడంతో ఆ పిల్లాడు ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి

    గ్రామంలోని ప్రధాని వీధి కావడంతో వెంటనే అక్కడున్న ఓ వ్యక్తి ఆ పిల్లాడిని చూశాడు. ఓ చెక్క తీసుకుని ఆ కరెంట్ వైర్ నుంచి పిల్లాడిని వేరు చేశాడు. పాపం అప్పటికే పిల్లాడి చెయ్య కాలిపోయి పొగలు వచ్చాయి. అమిత్ పూనియా అనే వ్యక్తి ఆ పిల్లాడిని చెక్కతో పక్కకు లాగడంతో ప్రాణాలు దక్కాయి. ఆ పిల్లాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. శరీరం కరెంట్ షాక్ కారణంగా ఎక్కువగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విద్యుత్ శాఖ అధికారులను తీవ్రంగా తప్పుబడుతున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే.. అంత స్ట్రాంగ్ కరెంట్ ప్రసరించే ఆ తీగ స్తంభానికి వేలాడుతూ ఉందని మండిపడ్డారు.

    ఇది కూడా చదవండి: Newly Married: ఇంత అందమైన అమ్మాయి భార్యగా దొరికిందనుకున్నాడు.. పెళ్లయి గట్టిగా రెండు నెలలు కాలేదు.. ఏమైందంటే..

    ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. విద్యుత్ స్తంభాలను, మరీ ముఖ్యంగా వర్షాకాలంలో నేరుగా తాకడం ప్రమాదకరం. ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో చెప్పలేం. ఇలా షాక్ తగిలి ఎవరైనా కనిపిస్తే కంగారులో నేరుగా వెళ్లి పొరపాటున కూడా పట్టుకోకుడదు. విద్యుత్ ప్రసరించే అవకాశం లేని చెక్క లాంటి దానితో పక్కకు లాగే ప్రయత్నం చేయాలి. అలా ఆలోచించి పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించిన అమిత్ పూనియాను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి.
    Published by:Sambasiva Reddy
    First published: