హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: సముద్ర తీరాన్ని శుభ్రం చేయడానికి సాగర కన్యలా మారి... ఓ మహిళ వినూత్న నిరసన

Viral: సముద్ర తీరాన్ని శుభ్రం చేయడానికి సాగర కన్యలా మారి... ఓ మహిళ వినూత్న నిరసన

image credits to Instagram

image credits to Instagram

ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో చాలా మంది పర్యావరణ ప్రేమికులు.. బాలి బీచ్ లను శుభ్రపరచడానికి కదిలారు. వందల సంఖ్యలో అక్కడకు చేరుకుని బాలి బీచ్ ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తున్నారు.

 • News18
 • Last Updated :

  ఎవరెన్ని చెప్పినా తాము మాత్రం మారమంటున్నది ఆధునిక మానవ సమాజం. ప్రకృతిని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నామని రోజూ నిరూపిస్తూనే ఉన్నది. అయితే ఇవన్నీ చూస్తూ ప్రకృతి ఏమీ చేతులు కట్టి ఊరుకోలేదు. మారకపోతే ముప్పు తప్పదని అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ఎన్ని విపత్తులు వచ్చినా తమ పంథా మారదని మనిషి విర్రవీగుతూనే ఉన్నాడు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం.. విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకం.. సముద్రాలను కలుషితం చేయడం.. ఒక్కటా రెండా... దీనికి వ్యతిరేకంగా చాలా మంది పర్యావరణ వేత్తలు పోరాడుతున్నారు. తాజాగా.. ఒక పర్యావరణ ప్రేమికురాలు.. ఇక మనుషులు మారరని.. ముల్లును ముల్లుతోనే తీయాలని నిశ్చయించుకున్నది. సాగరతీరంలో సముద్రం నుంచి కొట్టుకొచ్చిన మత్సకన్యలా చుట్టూ ప్రజలు పారవేసిన చెత్తలోనే పడుకుని నిరసన తెలిపింది.

  ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిందీ ఘటన. బాలి అంటేనే బీచ్ లకు ఫేమస్. ఇక్కడ ఉన్న పదుల సంఖ్యలో బీచ్ ల దగ్గర ఎంజాయ్ చేయడానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వచ్చిపోతుంటారు. అక్కడికి వచ్చినవాళ్లు సముద్రాన్ని చూస్తూ.. ఆ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించాల్సింది పోయి.. వెంట తెచ్చుకున్న బాటిల్స్ ను ఇష్టమొచ్చినట్టు పారేయడం.. వాటిని సముద్రంలో విసిరేయడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆహ్లాదంగా ఉండాల్సిన బీచ్ లు.. చెత్తకుప్పల కంటే అధ్వాన్నంగా తయారయ్యాయి.  ఇది చూసిన బెల్జియం కు చెందిన పర్యావరణవేత్త లారా (Laura) హృదయం చలించిపోయింది. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలనుకుంది. కానీ ప్రజల్లో ఎంతగా అవగాహన కార్యక్రమాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అనుకుంది. దీంతో డంపింగ్ యార్డ్ లుగా మారినా ఆ బీచ్ లోనే.. చుట్టూ చెత్త మధ్యలో సాగరకన్యలా మారి.. అందులోనే పడుకున్నది. ఇందుకు సంబంధించిన చిత్రాలను బాలికి చెందిన ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్ వయన్ సుయద్న డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరలవుతున్నాయి.


  View this post on Instagram


  A post shared by Wayan Suyadnya (@hiwayan)
  View this post on Instagram


  A post shared by Wayan Suyadnya (@hiwayan)  ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో చాలా మంది పర్యావరణ ప్రేమికులు.. బాలి బీచ్ లను శుభ్రపరచడానికి కదిలారు. వందల సంఖ్యలో అక్కడకు చేరుకుని బాలి బీచ్ ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తున్నారు.


  కాగా.. దీనిపై లారా స్పందిస్తూ.. ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడం ఈ పరిష్కారం కాదని అసలు దానిని తయారుచేయడమే ఆపాలని డిమాండ్ చేశారు. కొకోకోలా, పెప్సీ, యూనిలివర్, నెస్లే వంటి సంస్థలు ఇప్పటికైనా దీనిపై ఆలోచన చేయాలని ఆమె కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని.. లేకుంటే మనందరం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. తన నిరసనతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన లారా పోరాట పటిమను నెటిజన్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నది. ముల్లును ముల్లుతోనే తీయాలంటే ఇదేనేమో...

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Instagram, Social Media

  ఉత్తమ కథలు