Home /News /trending /

Skelton dance: ఎవరూ లేని స్మశానానికి ఒంటరిగా వెళ్లిన మహిళ.. అక్కడ అస్థిపంజరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ..

Skelton dance: ఎవరూ లేని స్మశానానికి ఒంటరిగా వెళ్లిన మహిళ.. అక్కడ అస్థిపంజరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ..

అస్థి పంజరంతో నృత్యం చేస్తున్న సన్యాసిని

అస్థి పంజరంతో నృత్యం చేస్తున్న సన్యాసిని

యూకే (UK)లోని ఓ స్మశానంలో ఓ చిత్రం (Picture) చూసి నెటిజన్లు షాక్ ​(shock)కు గురయ్యారు. ఏం దయ్యం (ghost).. గియ్యం లాంటిదేమైన కనిపించిందా అనుకునేరు.. అలాంటిదేమీ లేదు కానీ, ఓ సన్యాసి (Nun) ని అక్కడ చేసిన పని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఫొటోలో చూశాం కానీ, ఆ సీన్​ డైరెక్టుగా చూస్తే పరుగు లంకించుకునేవాళ్లు కోకోల్లలు. ఇంతకీ ఆ సన్యాసిని ఏం చేసిందంటారా?

ఇంకా చదవండి ...
  స్మశానం (Cemetery). మనిషి చివరికి చేరే ప్రదేశం. అక్కడి వెళితే రోదనలే వినిపిస్తాయి. మనం మన ఆత్మీయులను కోల్పోయినపుడు అంత్యక్రియలు చేయడానికి మాత్రమే స్మశానానికి వెళతాం. ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్లం. అయితే రాత్రిళ్లు మాత్రం స్మశానాలు (Cemetery) చాల భయంకరంగా ఉంటాయి. కుక్కల ఆరుపులు, వింత వింత శబ్ధాలు.. అబ్బో అదో మాయా ప్రపంచం లాగే ఉంటుందనుకోండి. ఇపుడు ఈ స్మశానం గురించి ఎందుకు చెబుతున్నానంటారా?.. యూకే (UK)లోని ఓ స్మశానంలో ఓ చిత్రం (Picture) చూసి నెటిజన్లు షాక్ ​(shock)కు గురయ్యారు. ఏం దయ్యం (ghost).. గియ్యం లాంటిదేమైన కనిపించిందా అనుకునేరు.. అలాంటిదేమీ లేదు కానీ, ఓ సన్యాసి (Nun) ని అక్కడ చేసిన పని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఫొటోలో చూశాం కానీ, ఆ సీన్​ డైరెక్టుగా చూస్తే పరుగు లంకించుకునేవాళ్లు కోకోల్లలు. ఇంతకీ ఆ సన్యాసిని ఏం చేసిందంటారా? ఆ వివరాలు తెలుసుకుందాం..

  యూకే  (United Kingdom)లోని హల్ సిటీలోని స్మశానంలో శనివారం మధ్యాహ్నం సన్యాసిని నృత్యం చేయడం, అస్థిపంజరం (Skelton) తో ఆడుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన బాటసారులు చూసి ఖంగుతిన్నారట. మీడియా నివేదికల ప్రకారం.. ఎవరూ లేని ఆ స్మశానానికి ఆ మహిళ (women) ఒంటరిగా (alone) వెళ్లిందట. అయితే అక్కడ ఉన్న ఓ అస్థి పంజరం దగ్గర నిలబడింది. వెంటనే ఆ ఆస్తి పంజరం (Skelton)తో ఆడుకోవడం, నృత్యం చేయడం (Nun Dancing with skeleton) మొదలుపెట్టింది. ఈ సంఘటన హల్ జనరల్ స్మశానవాటిక సమీపంలో జరిగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ప్రయాణిస్తున్న వారు చూశారు. వాహనాలు కూడా కాసేపు ఆపేశారు.

  ఆ సమయంలో సన్యాసిని అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ సన్యాసి (Nun)ని వలె దుస్తులు ధరించింది. ఇది కాకుండా, తలపై కండువా కూడా ధరించింది. ఈ వింత సంఘటనను స్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించారు.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు షాక్‌‌కు గురవుతున్నారు. ఆ మహిళకు మతి స్థిమితం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ స్మశానంను ఇపుడు ఉపయోగించట్లేదట. 50 ఏళ్లుగా అది మూసే ఉంది. 1847లో దానిని ప్రారంభించారట. 1972లో మూసివేశారట. కాగా, ఆ సమాధిలో కలరాతో చనిపోయిన దాదాపు 187 మృతదేహాలను ఖననం చేశారట.

  కాగా, ఇలా అస్థి పంజరాలతో ఆడుకోవడం కొత్తేమీ కాదు. అమెరికాకు చెందిన రెండేళ్ల థియోకు అస్థి పంజరం అంటే మహా ఇష్టం. థియో ఆ ఆస్థి పంజరమే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంటాడు. బొమ్మ అస్థిపంజరం తనకు ఎంతో నచ్చడంతో తనతో పాటు అది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ఆ అస్థిపంజరానికి బెన్ని అనే ముద్దుపేరు కూడా పెట్టడం గమనార్హం.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ghost stories, Trending news, United Kingdom

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు