హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Intelligent Woman: ఘోర ప్రమాదం నుంచి రైలును కాపాడిన మహిళ.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..?

Intelligent Woman: ఘోర ప్రమాదం నుంచి రైలును కాపాడిన మహిళ.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..?

ఓం వతి

ఓం వతి

యూపీలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఓ మహిళ చాకచక్యంగా వ్యవహరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.  రైలు పట్టా విరిగిపోవడాన్ని గమనించిన మహిళ వెంటనే బుర్రకు పదునుపెట్టింది. వేలాదిమందిని కాపాడింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఈ స్టోరిలో తెలుసుకోండి..

ఇంకా చదవండి ...

యూపీలో రైలు ప్రమాదం (Train Accident) తృటిలో తప్పింది. ఓ మహిళ (Intelligent Woman) చాకచక్యంగా వ్యవహరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. రైలు పట్టా విరిగిపోవడాన్ని గమనించిన మహిళ వెంటనే తన ఎర్ర చీరను ఎగరవేసి అటుగా వస్తున్న రైలును ఆపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​ (Uttar Pradesh) ఇటాహ్ జిల్లా కేంద్రానికి 20 కీలో మీటర్ల దూరంలో ఉన్న కుస్బా రైల్వే స్టేషన్ (Kusba Railway Station) సమీపంలో చోటుచేసుకుంది. ఇటాహ్ జిల్లా అవఘర్ బ్లాక్‌లోని గులేరియా గ్రామానికి చెందిన ఓంవతి అనే 65 ఏళ్ల మహిళ పొలం పనులకు వెళ్తుండగా..రైల్వే ట్రాక్‌ విరిగిపోవడాన్ని (Breaking the railway track) గుర్తించింది. ఇంతలో అటు నుంచి రైలు వస్తుండటం గమనించింది. వెంటనే రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. జెండా ఎగరవేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడంతో వెంటనే తన ఎర్ర చీర (Red saree)ను విప్పి గాల్లో ఊపింది. రైలు డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించేలా చెట్టు కొమ్మలను ఉపయోగించి ఎర్ర చీరను ట్రాక్‌కు అడ్డంగా వేలాడదీసింది.

ఎరుపు రంగు చీరను గుర్తించి..

ఇటాహ్ నుంచి తుండ్ల వెళ్లే ఓ ప్యాసింజర్ రైలు (Passenger train) కూత వేసుకుంటూ వస్తుండగా.. అందులోని రైలు డ్రైవర్ ట్రాక్‌పై ఎరుపు రంగు చీర (Red saree)ను గుర్తించి, సమయానికి బ్రేకులు వేశాడు. రైల్వే ట్రాక్ (railway track) దెబ్బతినడం గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటినా రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌కు మరమ్మతులు చేశారు. గంట తరువాత రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రమాదం జరగకుండా రైలును ఆపిన మహిళను ట్రైన్ డ్రైవర్ మెచ్చుకున్నాడు. ఆమెకు రూ.100 బహుమతిగా ఇచ్చాడు.

సోషల్ మీడియాలో పోస్ట్..

ఈ ఘటనపై ఓంవతి మాట్లాడుతూ.. ఎర్ర రంగు ప్రమాదాన్ని గుర్తించే సంకేతం కనుక డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి వెంటనే తన చీరను జెండాల ఊపానని ఆమె తెలిపింది. వద్దు అని వారించినా..  రైలు డ్రైవర్ తనకు రూ.100 ఇచ్చాడని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను యూపీ పోలీస్ సచిన్ కౌశిక్ సోషల్ మీడియా (Social media)లో పోస్ట్ చేశాడు. ‘‘ ఓంవతి అనే మహిళ ఉదయం పొలంలో పనికి వెళుతుండగా విరిగిన ట్రాక్‌‌ను గుర్తించింది. ఇంతలో రైలు రావడాన్ని గుర్తించి, ఆమె తన ఎర్రటి చీరను ట్రాక్‌పై కర్రల సహాయంతో అడ్డంగా ఉంచి ప్రమాదాన్ని నివారించింది. సదరు మహిళకు సెల్యూట్’’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఘటనపై రైల్వే వర్గాలు స్పందించాయి. అదే రైలు తుండ్లా నుంచి ఇటాహ్ వెళ్లిన సమయంలో ట్రాక్ దెబ్బతిని ఉంటుందని పేర్కొన్నాయి. ట్రాక్‌మెన్ జావేద్ తనిఖీ చేసిన సమయంలో( ఒక రోజు ముందు) రైలు పట్టా బాగానే ఉన్నట్లు తేలింది.

కాగా, రైలు ప్రమాదాలను (Rail accidents) నివారించడానికి భారత రైల్వేశాఖ అత్యాధునిక వ్యవస్థను తీసుకొచ్చింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ టెక్నాలజీకీ కవచ్ అని పేరుపెట్టారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ టెక్నాలజీను స్వయంగా పరీక్షించారు. ఈ టెక్నాలజీతో ఇకపై ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురైనా ప్రమాదం జరగదు. రెడ్‌ సిగ్నల్‌ పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును ముందుకు తీసుకెళుతుంటే.. కవచ్‌ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు వేయవచ్చు. పట్టాలు బాగా లేనప్పుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు వెంటనే గుర్తించి కవచ్ సహాయంతో రైలును ఆపవచ్చు.

First published:

Tags: Train accident, Trending news, Uttar pradesh

ఉత్తమ కథలు