• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • A WOMAN IN THE US HAS MARRIED HERSELF IN A CEREMONY COSTING RS 1 LAKH AFTER SPLITTING FROM HER BOYFRIEND SRD GH

Woman married herself: ఈ అమ్మాయి తనని తానే పెళ్లాడింది. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Woman married herself: ఈ అమ్మాయి తనని తానే పెళ్లాడింది. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Photo Credit : Twitter

Viral News: ‘పెళ్లి ఎందుకు చేసుకుంటారు?’ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెబుతారు? పెళ్లి చేసుకోవడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉండవచ్చు.

  • Share this:
‘పెళ్లి ఎందుకు చేసుకుంటారు?’ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెబుతారు? పెళ్లి చేసుకోవడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉండవచ్చు. ఒక కొత్త కారణంతో వినూత్నంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అమెరికన్ మహిళ. బ్రేకప్‌ తరువాత 35 ఏళ్ల మెగ్ టేలర్ మోరిసన్‌కు పెళ్లి విషయంలో కొత్త ప్రశ్న ఎదురైంది. ఇతరుల సంతోషం కోసం తానెందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుందామె. కొత్తగా ఆలోచించి తనను తాను పెళ్లి చేసుకొని వార్తలో నిలిచింది. ఇందుకు సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. పెళ్లి తరువాత అద్దంలో తనను తాను ముద్దుపెట్టుకొంది. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లికి కొన్ని రోజులకు ముందే ఆమె ప్రియుడితో విడిపోయింది. ఈ సొంత పెళ్లి కోసం మెగ్ 1,000 పౌండ్లు (రూ.1.02 లక్షలు) ఖర్చు చేయడం విశేషం. అమెరికాలోని అట్లాంటాకు చెందిన మెగ్ టేలర్ మోరిసన్ 2020 జూన్‌లో తన ప్రియుడితో విడిపోయింది. హాలోవీన్ సందర్భంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె కలలు నెరవేరలేదు. దీంతో బ్రేకప్ తరువాత వినూత్నంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

* సంప్రదాయాలను పాటిస్తూ..
తన పెళ్లి కోసం ఇతర వ్యక్తులను సంతోషపెట్టడం ఎందుకనే భావన నుంచే సొంత పెళ్లి అనే ఆలోచన వచ్చిందని మెగ్ తెలిపింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ఆమె పెళ్లి విషయంలో వెనక్కు తగ్గకపోవడం విశేషం. వరుడు లేకుండా జరిగిన ఈ పెళ్లి కోసం మెగ్ అన్ని సంప్రదాయాలనూ పాటించడం విశేషం. కస్టమ్ మేడ్ కేక్, డ్రెస్‌ను ఆమె ఆర్డర్ చేసింది. పెళ్లి కోసం ప్రత్యేకంగా ఒక డైమండ్ రింగ్ కూడా కొనుగోలు చేసింది. వివాహ వేడుకలో ఉంగరం పెట్టుకొని, అద్దంలో తన రూపాన్ని ముద్దు పెట్టుకుంది. తన సొంత లక్ష్యాలు, కోరికల కోసం పాటుపడతానని పెళ్లిలో ప్రమాణం చేసింది. తన ఆలోచనల ప్రకారమే నడచుకుంటానని చెప్పింది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగ్‌కు సన్నిహితంగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

* మరో పెళ్లికి సిద్ధం
మంచి వ్యక్తి దొరికితే రిలేషన్‌షిప్‌లో ఉండటానికి తనకు అభ్యంతరాలు లేవని మెగ్ చెప్పింది. అతడిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ప్రకటించింది. ‘పెళ్లి సందర్భంగా నేనొక వాగ్ధానం చేశాను. నా మ్యారేజ్ రింగ్‌ను చూసిన ప్రతిసారీ నా కోసం నేను పెళ్లి చేసుకున్నాననే విషయం గుర్తొస్తోంది. పెళ్లి నా జీవితాన్ని ప్రశాంతంగా, అందంగా తీర్చిదిద్దింది’ అని మెగ్ చెబుతోంది. కరోనా మహమ్మారి కారణంగా హనీమూన్‌కు వెళ్లలేదని ఆమె చెప్పింది. కరోనా విపత్తు ముగిసిన తరువాత హనీమూన్‌కు వెళ్లి ప్రశాంతంగా గడుపుతానని వివరించింది.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు