ముస్లిం దేశాలలో చట్టాలు కఠినంగా ఉంటాయి. అక్కడ వారి చట్టాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అక్కడ ప్రభుత్వ శిక్షలకు బలికావాల్సిందే. మరీ ముఖ్యంగా ఇస్లాం కు వ్యతిరేకంగా చర్యలుంటే మాత్రం దానిని అసలు క్షమించరు. కానీ ఒక మహిళ అలాంటి పనే చేసి కటకటాలపాలైంది. అసభ్యకరమైన కేకులను తయారుచేయడమే గాక.. వాటిని అంగం.. యోని వంటి శరీర అవయవాల రూపంలో తయారుచేసినందుకు గానూ ఆమెను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఈజిప్టు రాజధాని కైరోకు చెందిన ఒక మహిళ అక్కడ స్థానికంగా ఉండే ఒక రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తుంది. ఆమె ఒక బర్త్ డే కేక్ ను స్థానికంగా నిషేధించబడిన ఆహర పదార్థాలతో తయారుచేసింది. అంతేగాక.. ఆ కేక్ లో అంగం.. పిరుదులు.. యోని వంటి రూపాలతో చిన్న చిన్న పదార్థాలను తయారుచేశారు. ఇది అక్కడ ఆగ్రహానికి గురి చేసింది. ఇది వారి చట్టాల ప్రకారం నిషిద్ధం. దీనిని ‘విలువల వ్యవస్థ పై దాడి, క్రూరమైన దుర్వినియోగం’ గా పరిగణిస్తూ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకలకు ఆతిథ్యమిచ్చిన క్లబ్ పై కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు.
సదరు మహిళను అరెస్టు చేసిన తర్వాత ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తూ... ‘ఇది సామాజికంగా ఆమోదయోగ్యం కాదు.. పురుషాంగం, యోని కాకుండా వేడుకలు జరుపుకోవడానికి 100 మార్గాలున్నాయి...’ అని కామెంట్ చేశారు. వారి అరెస్టు సరైందేనని అన్నారు. కాగా.. ఆమెపై సుమారు 300 డాలర్ల జరిమానా వేశారు అదికారులు. ఆ తర్వాత ఆమెను విడుదల చేశారు.
Published by:Srinivas Munigala
First published:January 20, 2021, 16:50 IST