Rattlesnake: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. పార్శిల్‌ వద్ద కనిపించిన పాము

పార్శిల్‌ వద్ద కనిపించిన పాము

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక అమెరికన్ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తన ఇంటికి డెలివరీ చేసిన ఫుడ్ పార్శిల్‌ దగ్గర ఒక విషపూరితమైన పాము కనిపించింది. దీంతో భయపడిన ఆమె.. స్నేక్ సొసైటీ ప్రతినిధులకు ఫోన్ చేసింది. అమెరికాలోని అరిజోనాలో...

  • Share this:
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక అమెరికన్ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తన ఇంటికి డెలివరీ చేసిన ఫుడ్ పార్శిల్‌ దగ్గర ఒక విషపూరితమైన పాము కనిపించింది. దీంతో భయపడిన ఆమె.. స్నేక్ సొసైటీ ప్రతినిధులకు ఫోన్ చేసింది. అమెరికాలోని అరిజోనాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఒక మహిళ ఉబెర్ ఈట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. దాన్ని డెలివరీ బాయ్ ఆమె ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి విషపూరితమైన వెస్ట్రన్ డైమండ్ బ్యాక్ ర్యాటిల్ స్నేక్ వచ్చి ఒక మూలన నక్కింది. ఆ పార్శిల్‌కు పాము కాపలా కాస్తుందా అన్నట్లు కనిపించింది. వెస్ట్రన్ డైమండ్ బ్యాక్ ర్యాటిల్ స్నేక్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, మెక్సికోలలో కనిపిస్తుంది. వీటి వల్లనే ఆయా ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ర్యాటిల్ స్నేక్ జాతుల్లో ఈ పాములు చాలా కోపంగా ఉంటాయి.

అరిజోనాలోని టుక్సన్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ పామును చూసి షాక్ అయ్యింది. దానికి దగ్గర్లో ఉన్న ఫుడ్ పార్శిల్‌ను తీసుకునేందుకు భయపడింది. వెంటనే పాములను పట్టుకునే ర్యాటిల్ స్నేక్ సొల్యూషన్స్ కంపెనీకి ఫోన్ చేసింది. ఈ సంస్థ జనావాసాల్లోకి వచ్చే పాములను పట్టుకొని అడవిలో వదిలేస్తుంది. ఆమె ఫోన్ చేయగానే సంస్థకు చెందిన ప్రతినిధులు వచ్చి పామును పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.






ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకు యూజర్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఫోటోలో పాము ఎక్కడ ఉందో తెలియట్లేదని ఒకరు కామెంట్ చేశారు. నేనైతే భయపడకుండా డెలివరీ వచ్చిన పార్శిల్‌ తీసుకునేవాడినని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. డెలివరీ బాయ్ పార్శిల్‌ను అక్కడ పెట్టినప్పుడు పాము అక్కడ లేదని స్నేక్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్ తలుపు తెరిచేసరికి మాత్రం పాము అక్కడ ఉందన్నారు. దాన్ని బంధించి సమీపంలోని ఎడారిలో వదిలారు.
Published by:Sambasiva Reddy
First published: