Home /News /trending /

A WOMAN BARELY SURVIVED AN ATTACK BY A LEOPARD IN MUMBAI GOREGAON AREA VIDEO GOES VIRAL SK

Viral Video: చిరుతతో వృద్ధురాలి ఫైట్.. భయపడలేదు.. తరిమికొట్టింది.. వైరల్ వీడియో

మహిళపై చిరుత దాడి దృశ్యాలు (Image:ANI)

మహిళపై చిరుత దాడి దృశ్యాలు (Image:ANI)

Viral Video: చిరుతపై నిర్మల దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆమె తెగువకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు మామూలు బామ్మ కాదు.. సివంగి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    వన్య ప్రాణులు జనవాసాల్లోకి వస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుటున్నాయి. ఏనుగులు, పులులు, ఇతర జంతువులు గ్రామాల్లోకి చొరబడి అలజడి రేపుతున్నాయి. అలాంటివి మనకు కనిపిస్తే భయంతో వణికిపోతాం. వామ్మో... అంటూ పరుగులు పెడతాం. ప్రాణాలరచేత పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాం. కానీ ఓ వృద్ధురాలు మాత్రం వీరోచితంగా పోరాడింది.  తనపై దాడి చేసేందుకు వచ్చిన చిరుతపై ఎదురు దాడిచేసి.. తరిమికొట్టింది. చాకచక్యంతో దాని నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. ముంబై శివారులో గోరెగావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిరుతతో ఆ వృద్ధురాలు చేసిన పోరాటం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    నిర్మలా దేవీ సింగ్‌ అనే వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసిముంబైలోని అరేయ్ డెయిరీ ఏరియాలో నివసిస్తోంది. ఆమెకు పలు అనారోగ్య  సమస్యలు ఉన్నాయి. సరిగా నడవలేరు. వాక్ స్టిక్ సాయంతో మాత్రమే నడుస్తారు. ఐతే సెప్టెంబర్ 29న రాత్రి 7:47 గంటల సమయంలో తమ ఇంటి ముందు అరుగుపై కూర్చింది. అప్పటికే ఆమెకు కొంత దూరంలో ఓ చిరుత ఉంది. కానీ నిర్మలా దేవీ గమనించలేదు. నిర్మలా దేవి కూర్చోగానీ.. చిరుత నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వద్దకు వచ్చింది.  అనంతరం ఆమెపై దాడిచేసింది. పంజా విసరడంతో నిర్మలా దేవి కిందపడిపోయింది.  కానీ వెంటనే తేరుకొని తన చేతి కర్రతో చిరుతపై ఎదురు దాడి చేసింది. కర్రతో చిరుత ముఖంపై కొట్టడంతో.. అది భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది.

    తోబుట్టువు మరణంతో కుంగిపోయిన పిల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్లు  ఆగవు



    Viral Video: రైల్వే క్రాసింగ్ దగ్గర షాకింగ్ ఘటన.. రైలొస్తుంటే ఈ యువతి ఏం  చేసిందంటే..

    ఆ తర్వాత నిర్మలా దేవి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగెత్తుకు వచ్చారు. ఇరుగుపొరుగు కూడా అక్కడికి  చేరుకున్నారు. చిరుత దాడిలో గాయపడిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఐతే నిర్మలా దేవీకి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ముఖం, కాలికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. చిరుతపై నిర్మల దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆమె తెగువకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు మామూలు బామ్మ కాదు.. సివంగి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Mumbai, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు