హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: వెడ్డింగ్ కార్డుతో పాటు ఓ క్వార్టర్, బాటిల్ వాటర్, కొన్ని చిప్స్.. ఆహా.. ఏముందిలే

Viral Video: వెడ్డింగ్ కార్డుతో పాటు ఓ క్వార్టర్, బాటిల్ వాటర్, కొన్ని చిప్స్.. ఆహా.. ఏముందిలే

పెళ్లి కార్డుతో పాటు మందు, వాటర్, మంచింగ్

పెళ్లి కార్డుతో పాటు మందు, వాటర్, మంచింగ్

ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో పెళ్లిళ్లకు హాజరయ్యే వారి మీద పరిమితులు విధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఈ షరతులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

పెళ్లి కార్డుతో పాటు ఏదైనా ఓ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడో కొత్త ట్రెండ్ అయింది. కొందరు వెండి గిన్నెలను గిఫ్ట్ ఇస్తారు. మరికొందరు బంగారం ఇస్తారు. తమ రేంజ్ కు తగినట్టు ట్రెండీగా ఉండేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఈ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. పెళ్లి శుభలేఖతో పాటు అతిథులకు ఓ మందుబాటిల్, వాటర్ బాటిల్, మంచింగ్ కోసం ఓ ప్యాకెట్‌ను కూడా ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ కుటుంబం ఈ వెరైటీ శుభలేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వెడ్డింగ్ కార్డులో పేర్కొన్న వివరాల ప్రకారం అమన్, మహిర పెళ్లి డిసెంబర్ 14న జరగనుంది. అందుకు మూడు రోజుల ముందు నుంచే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరపనున్నారు. 12వ తేదీ ఓ వేడుక చేయనున్నారు. 13వ తేదీ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలను చేయనున్నారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ పెళ్లికి అందరూ తప్పనిసరిగా రావాలంటూ ఓ చిన్న బ్యాగ్‌లో పెళ్లి శుభలేఖ సిద్దం చేశారు. ఓ బాక్సులాంటి ఇన్విటేషన్‌లో పెళ్లి శుభలేఖతో పాటు మద్యం బాటిల్ కూడా ఉన్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో పెళ్లిళ్లకు హాజరయ్యే వారి మీద పరిమితులు విధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఈ షరతులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దీంతో జనం పెళ్లిళ్లకు హాజరయ్యే అవకాశం లేదు. దీంతో పెళ్లిళ్లకు రాలేకపోయినా, తమ పెళ్లి గుర్తుగా వారికి మద్యం బాటిల్ అందించడం ద్వారా బంధువుల్లో ఆనందం పంచుతోంది ఆ కుటుంబం.


ఇంటికే పెళ్లి భోజనం..

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల కారణంగా చాలా తక్కువ సంఖ్యలోనే అతిథులు పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో తమ పెళ్లికి రాలేకపోయే వారి కోసం కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు వధూవరులు.పెళ్లికి రాలేకపోయే వారు కేవలం వెబ్‌కాస్ట్‌లో జాయిన్ అయితే చాలు. అక్కడే పెళ్లిని కన్నులారా చూసి ఆన్ లైన్‌లో అక్షింతలు వేసేయవచ్చు. పెండ్లి చూసిన తర్వాత విందు భోజనం మీ ఇంటికి పార్సిల్ లో పంపించేస్తారు. ఎంతమంది వుంటే ఎంతమందికి వివాహ భోజనం వచ్చేస్తుంది. అన్ని వివరాలు ముందుగానే వాట్సప్ లో పంపిస్తున్నారు. కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటే, వాటికి కొత్త కొత్త పరిష్కారాలు వెతుకుతున్నారు జనం. ఈ క్రమంలో పెళ్లిళ్ల కోసం, అతిథుల కోసం ఇదో కొత్త ట్రెండ్ మొదలైంది.

First published:

Tags: Maharashtra, VIRAL NEWS, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు