Home /News /trending /

A VIETNAMESE FAMILY OF SIX ENJOYING THEIR DINNER AND CHATTING WHAT HAPPENED NEXT WAS SHOCKING VIDEO THAT HAS GONE VIRAL ON SOCIAL MEDIA SRD

Viral Video : ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తున్నారు... కానీ, ఇంతలోనే ఊహించని షాక్.. ఆ దేవుడే కాపాడాడు..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video : ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ చిన్న పిల్లాడు బతికాడు.

ఇంకా చదవండి ...
    ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ చిన్న పిల్లాడు బతికాడు. లేకపోతే ఊహించని ఘోరం జరిగి ఉండేది. అనుకోని ప్రమాదం నుంచి ఓ కుటుంబ సభ్యులు లక్కీగా బయట పడ్డారు. అదృష్ణ వశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకెళితే.. ఎప్పటిలాగే కుటుంబమంతా ఆ రోజూ భోజనానికి కూర్చుంది. కంచాలు, గిన్నెలు మధ్యలో పేర్చి..కుటుంబసభ్యులు వాటి చుట్టూరా కూర్చున్నారు. పిల్లలు, పెద్దలూ అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇంతలో ఏదో అలికిడి.. దీంతో అక్కడే ఉన్న ఓ చిన్న కుర్రాడు తల పైకెత్తి చూశాడు. కానీ..అతడికి ఏం అర్థం కాలేదు. అలాగే కొన్ని క్షణాలు పైకెత్తే చూశాడు. అక్కడున్న వారందరూ ఆ శబ్దాన్ని విన్నారు! అయితే.. ఏదో శబ్దం అయ్యి ఉంటుందిలే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో..పైనున్న సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి కిందపడింది. మరి ఆ టైంలో వారిపై ఏ దేవుడు దయచూపాడో గానీ.. చిన్న పిల్లాడి తలకు నేరుగా తగలాల్సిన ఫ్యాన్ కొద్దిగా పక్కకు పడింది. వాటి రెక్కల మధ్య అతడి తల..! ఈ సీన్ చూడగానే..అక్కడే ఉన్న మహిళకు గుండె ఆగినంతపనైంది.

    వెంటనే ఆమె లేచి పరిగెత్తుకు వచ్చి..ఆ చిన్నపిల్లాడికి దెబ్బలేమైనా తగిలాయేమోనని చూసింది. తలను నిమిరింది. వియత్నాంలో ఓ కుటుంబం ఇటీవల ఎదుర్కొన్న భయానక పరిస్థితి ఇది. అదృష్టవశాత్తూ ఆ కుటుంబంలో ఎవరికీ దెబ్బలు తగలలేదు. సీలింగ్ ఫ్యాన్లు అకస్మాత్తుగా ఊడి కిందపడటం చాలా అరుదు. కానీ..అది జరిగితే..ఎంతటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించిన ఘటన ఇది. ఫ్యాన్ కింద పడిన సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

    ఇది కూడా చదవండి :  వీడెవడండీ బాబూ..! ఈ సారి ప్యాడ్లు కట్టుకుని కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు..!



    ఈ ఘటన జులై 8, 2021 జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా తెలియడం..ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన వారంతా తెగ భయపడిపోతున్నారు. చిటికెలో పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అలాగే చాలా కుటుంబాలు ఇలా ఫ్యాన్ కింద కూర్చుని భోజనం చేస్తాయి. కాబట్టి..సహజంగానే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లాడికి ఏ ప్రమాదమూ జరగక పోవడం నిజంగా అద్భుతమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ పిల్లోడికి భూమ్మీద నూకలుండబట్టి ప్రాణాలతో బతికాడని కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: International news, Trending videos, Viral Video, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు