Video : అడిగి మరీ కొరడాతో కొట్టించుకున్న సీఎం..

కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ సంతోషంగానే కనిపించారు.

news18-telugu
Updated: October 29, 2019, 2:08 PM IST
Video : అడిగి మరీ కొరడాతో కొట్టించుకున్న సీఎం..
కొరడా దెబ్బలు తింటున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగల్
  • Share this:
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఉన్న ఓ ఆలయాన్ని ముఖ్యమంత్రి భూపేష్ భగల్ సందర్శించారు. అయితే, అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అమ్మవారి ఎదుట పూజారీ చేత్తో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి కూడా కొరడా దెబ్బలు తినేందుకు సిద్ధమయ్యారు. తన కుడిచేతి చొక్కాను కొంచెం పైకి లాగారు. అనంతరం పూజారి ముఖ్యమంత్రి చేతిపై కొరడా దెబ్బలను కొట్టారు. ఆరు కొరడా దెబ్బలు పడిన తర్వాత ముఖ్యమంత్రి ‘ఇక చాలు’ అన్నట్టుగా తన చేతిని వెనక్కు తీశారు. కొరడా దెబ్బలు తింటున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ భగల్ సంతోషంగానే కనిపించారు. అదే సమయంలో ‘సీఎం కదా.. కొంచెం మెల్లగా కొడదాం.’ అనే భావన ఏ మాత్రం లేకుండా.. ఆ పూజారి కూడా భూపేష్ భగల్‌ను సామాన్య భక్తుడిలానే భావించి కొరడాతో కొట్టారు. అయితే, కొరడాతో కొట్టడానికి ముందు, కొట్టిన తర్వాత ముఖ్యమంత్రికి నమస్కరించారు. వెళ్లిపోయే ముందు ముఖ్యమంత్రి.. ఆ పూజారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.



First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>