Home /News /trending /

Viral: ఇంట్లోకొస్తున్న పాము.. ఆ పాముతో మాట్లాడి కన్విన్స్ చేసి పంపించేసిన మహిళ.. వీడియో వైరల్

Viral: ఇంట్లోకొస్తున్న పాము.. ఆ పాముతో మాట్లాడి కన్విన్స్ చేసి పంపించేసిన మహిళ.. వీడియో వైరల్

వీడియోలోని దృశ్యం

వీడియోలోని దృశ్యం

పామును చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ పాము ఇంటి పరిసరాల్లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా. అదెక్కడి కాటేసి చంపుతుందోనన్న భయంతో కొట్టి చంపేందుకు వెనుకాడరు. కానీ.. ఇంటి ముుందుకొచ్చిన పాముకు పద్ధతిగా నచ్చజెప్పి తిప్పి పంపించడం సాధ్యమయ్యే పనేనా.

ఇంకా చదవండి ...
    పామును చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ పాము ఇంటి పరిసరాల్లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా. అదెక్కడి కాటేసి చంపుతుందోనన్న భయంతో కొట్టి చంపేందుకు వెనుకాడరు. కానీ.. ఇంటి ముుందుకొచ్చిన పాముకు పద్ధతిగా నచ్చజెప్పి తిప్పి పంపించడం సాధ్యమయ్యే పనేనా. అయినా.. పాముకు నచ్చజెప్పడమేంటని.. ఇదెక్కడి వెటకారమంటూ సీరియస్ అవ్వకండి. పాముకు మనం మాట్లాడితే ఎలా అర్థమవుతుందని అనుకుంటున్నారా.

    కానీ.. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన మహిళకు ఈ డౌట్ ఏమాత్రం రాలేదు. ఆ మహిళ ఇంట్లో ఉండగా ఇంటి కాంపౌడ్ వాల్ దగ్గర గేటు దాటుకుని ఓ నాగు పాము పిల్ల ఇంట్లోకి రాబోయింది. ఆ మహిళ పామును చూసి నానా హైరానా పడలేదు. భయంతో కేకలేయలేదు. ఓ కర్రపుల్ల తీసుకుని ఇంట్లోకి రాబోతున్న పామును బయటకు పంపేందుకు ప్రయత్నించింది.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి...

    చాలా పద్ధతిగా ఇంట్లోకి రావొద్దని.. వెళ్లిపోవాలని పాముతో ఆ మహిళ చెప్పడం కొసమెరుపు. అలానే ఆ పామును గేటు నుంచి మాట్లాడుతూ బయటకు పంపింది. ఈసారి వచ్చినప్పుడు పాలు పోస్తానని ఆ పాముకు ప్రామిస్(మాటలతోనే లేండి) చేసింది. అయినా.. మళ్లీ తన ఇంటికి రావొద్దని.. నీ మంచికే చెబుతున్నానని.. జనాల మధ్యలోకి రావొద్దని ఆ పాముకు హితబోధ చేసింది. మొత్తానికి ఆ పాముకు అలా నచ్చజెప్పి కర్రపుల్లతో దూరంగా పంపుతూ ఆ మహిళ వెనక్కి వెళ్లిపోయేలా చేసింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాముపై ఆ మహిళ చూపించిన దయా గుణానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మాట్లాడిన పద్ధతి చూసి మెచ్చుకుంటున్నారు. కానీ.. అన్ని సందర్భాల్లో ఇలా పాములతో ప్రవర్తించడం కూడా మంచిది కాదని.. ఆ పాము మీదకొస్తే ప్రమాదం తప్పదని మరికొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలో పాముతో ఆమె అప్రోచ్ నచ్చిన చాలామంది ఆ మహిళ చమత్కారానికి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Coimbatore, Snake, Trending videos, Viral Video, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు