Video : గాడిదల్ని మెప్పించిన గాయకుడు... ఫన్నీ వీడియో...

Viral Video : కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి. ఇది అలాంటిదే. అతని పాటను అందుకొని గాడిదలు ఎలా పాడాయో మీరు వినాల్సిందే.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 1:14 PM IST
Video : గాడిదల్ని మెప్పించిన గాయకుడు... ఫన్నీ వీడియో...
గాడిదతో గీతాలాపన (Image : FB - Travis Kinley )
Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 1:14 PM IST
సౌత్ కరోలినాకు చెందిన ట్రావిస్ కిన్లీ వారం కిందట తన ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోని అప్‌లోడ్ చేశాడు. విషయమేంటంటే... అతడు తన గాడిదల దగ్గరకు వెళ్లి... డిస్నీకి చెందిన క్లాసికల్ మూవీ ది లయన్ కింగ్ నుంచీ ఓ సాంగ్ పాడాడు. అతను పాట అందుకోగానే... అతని గాడిదల్లో ఒకటైన నాథన్ గాడిద కూడా గొంతు సవరించుకుంది. అది కూడా గట్టిగా దానికి వచ్చినట్లు పాడేసింది. ఇద్దరూ స్వరాలు కలుపుతూ చక్కగా పాడేశారు. అంతే ఆశ్చర్యపోవడం ఆ వీడియో చూసిన వాళ్ల వంతైంది. వారంలో ఈ వీడియోను 43 లక్షల మంది చూశారు. ఇలా అనే కంటే... చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూస్తున్నారని కూడా అనుకోవచ్చు. అంతలా అది ఆకట్టుకుంటోంది మరి.

ట్రావిస్ ఇదివరకూ చాలాసార్లు తన గాడిదల దగ్గరకు వెళ్లి ఇలాగే నోటికొచ్చినట్లు పాడేవాడట. అప్పుడెప్పుడూ ఇలా స్పందించని నాథన్... ఇప్పుడు మాత్రం స్వరాలాపన చెయ్యడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసి... తెగ నవ్వుకుంటున్నామని నెటిజన్లు కామెంట్స్ పెడుతూ... ట్రావిస్‌ను బాగా పాడావని మెచ్చుకుంటున్నారు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...