Viral Video: ఇదెక్కడి వైరల్ వీడియో మామా.. ఈ గొడవేంది.. ఆ కాల్చుడేంది.. అసలు ముచ్చటేందంటే...

వైరల్ అయిన వీడియోలోని కొన్ని దృశ్యాలు

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి పోలీస్ ఓ వ్యక్తిని కాల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యక్తిని పోలీస్ కాల్చడంతో అతని పక్కనే ఉన్న ఓ యువతి ఏడుస్తూ కనిపించింది. ఆ యువతిని కూడా ఆ పోలీస్ కాల్చేశాడు. ఓ కేఫ్ ముందు...

  • Share this:
    స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, వీడియోల విషయంలో అంతే స్థాయిలో గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో కనిపించే వీడియోల్లో ఏది ఫేక్ వీడియోనో, ఏది రియల్ వీడియోనో తెలుసుకునే లోపే ఆ వీడియో ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. కొందరు ఫేక్ వీడియోలన్న సంగతి తెలియక విపరీతంగా షేర్లు కొట్టి అలాంటి వీడియోలను మరింత వైరల్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి పోలీస్ ఓ వ్యక్తిని కాల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యక్తిని పోలీస్ కాల్చడంతో అతని పక్కనే ఉన్న ఓ యువతి ఏడుస్తూ కనిపించింది. ఆ యువతిని కూడా ఆ పోలీస్ కాల్చేశాడు. ఓ కేఫ్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పట్టపగలే ఏంటీ దారుణం అంటూ నెటిజన్లు గగ్గోలు పెట్టారు. కొందరైతే ఆ పోలీస్ చర్యను తీవ్రంగా తప్పబడుతూ కామెంట్స్ చేశారు.

    అయితే.. ఆ వీడియోలో కనిపించినట్లు పట్టపగలే అంత దారుణం జరిగిందా అని ఆరా తీస్తే అదంతా ఓ వెబ్ సిరీస్ షూటింగ్ అని తెలిసింది. రాహుల్ శ్రీవాత్సవ్ అనే యూపీ పోలీస్ తన ట్విట్టర్‌లో ఈ వీడియోపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేశారు. ఆ వీడియోను హర్యానాలో కర్నల్‌లో ఉన్న ‘ఫ్రెండ్స్ కేఫ్’ ఎదుట చిత్రీకరించారని.. అది ఒక వెబ్ సిరీస్ షూటింగ్ అని ఆయన చెప్పారు.



    దీంతో.. ఆ వీడియోను చూసి పోలీసుపై కారాలుమిరియాలు నూరిన వారంతా కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలన్నింటినీ నిజమని నమ్మి కామెంట్స్ చేయడం సరికాదని పోలీసులు నెటిజన్లకు సూచించారు. వాస్తవం తెలిశాకే ఇలాంటి వీడియోలపై స్పందించాలని లేని పక్షంలో మరింత గందరగోళం సృష్టించినట్లవుతుందని చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published: