A VIDEO GETTING VIRAL IN SOCIAL MEDIA POSTED BY KERALA POLICE ABOUT A BROTHER WHO ACTS SO NATURALLY FULL DETAILS HERE HSN
Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!
వైరల్ వీడియోలోని దృశ్యం
వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్. ఇప్పుడేనా ఎప్పుడూ ఇంతేనా? నువ్వు సినిమాల్లోకి వెళ్తే స్టార్ హీరోలనే వెనక్కు నెట్టేస్తావ్.. వంటి సెటైరికల్ కామెంట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇంతకీ అసలు కథేంటంటే..
వీడు కనుక సినిమాల్లోకి వస్తే ఎన్టీవోడినే దాటేస్తాడు. మెగాస్టార్ చిరంజీవినే కొట్టేస్తాడు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమా హీరోలందరినీ ఎదిగిపోతాడు.. అంటూ సరదాగా ఫ్రెండ్స్ మధ్య కబుర్లు వస్తూనే ఉంటాయి. నీ నటనకు శభాష్ గురూ.. అంటూ ప్రశంసలు అందుకుంటుంటారు కూడా. స్కూల్లోనో, కాలేజీల్లోనో, ఊళ్లో నాటకాల్లోనో సరదాగా వేషం కట్టినప్పుడు ప్రశంసలు వస్తే పొంగిపోతారు. తాజాగా ఓ వ్యక్తికి ’ఏం నటన గురూ.. ఇరగదీశావ్‘ అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. మామూలు నెటిజన్లే కాదండోయ్ ఏకంగా పోలీస్ డిపార్ట్మెంటే పొగుడుతోంది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెడితే లైకులు, షేర్లు, కామెంట్లతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందనే కదా మీ డౌటు. ఆలస్యం దేనికి అసలు విషయంలోకి వెళ్లండిక.
కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఫన్నీగా ఉండటం, ఆ ఫన్నీ వీడియోకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తమదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ జోడించడంతో ఇట్టే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఏప్రిల్ 15వ తారీఖున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వస్తున్నారు. వాళ్లకు కొద్ది దూరంలోనే ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ వస్తోందని గ్రహించారు. అంతే, అస్సలు ఆలస్యం చేయలేదు. స్కూటీని వెంటనే వెనక్కు తిప్పేశారు. ఇద్దరు వ్యక్తులు ఆ స్కూటీపై పరారయ్యారు. మరో వ్యక్తి మాత్రం స్కూటీ నుంచి కిందకు దిగి తాపీగా వెనక్కు నడుచుకుంటూ వచ్చేశాడు.
ఆ స్కూటీని నడిపిన వ్యక్తికి హెల్మెట్ లేదు. ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. పోలీసులకు దొరికితే తమ పని ఖతం అని అనుకుని ఇద్దరు పరారవగా, ఓ వ్యక్తి మాత్రం సాధారణ పౌరుడిగా వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన జేబులోంచి ఓ మాస్కును కూడా తీసి పెట్టుకున్నాడు. పోలీస్ వ్యాన్ అతడి పక్కగా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లి ఏమీ ఎరుగనట్టు మాట్లాడాడు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోను తమదైన శైలిలో ఎడిట్ చేసి ’అమాయకుడిగా నటిస్తున్న ఓ బ్రదర్ ను చూడండంటూ‘ కామెంట్ పెట్టి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వెంటనే వైరల్ అయింది. ఆ వీడియో కింద ఇప్పటి వరకు దాదాపు 1800 కామెంట్స్ వచ్చాయి. 43వేల మంది లైక్ చేశారు. 4700 మంది ఆ వీడియోను షేర్ చేశారు. మరి మీరు కూడా ఆ వీడియోను ఓ లుక్కేసి కామెంట్ చేసుకోండి.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.