Home /News /trending /

Viral Video : వామ్మో సముద్రంలో ఇదేం వింత.. ఏలియన్స్ పనేనా.. వైరలవుతున్న షాకింగ్ వీడియో..

Viral Video : వామ్మో సముద్రంలో ఇదేం వింత.. ఏలియన్స్ పనేనా.. వైరలవుతున్న షాకింగ్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని విశేషాలు ఎన్నో ఉన్నాయ్. కొన్ని ఆశ్చర్యకర ఘటనలను తేలిగ్గా కొట్టిపారేసినా.. చూడటానికి మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిత్రాలు కూడా జరుగుతుంటాయా.. అన్నంత విస్మయానికి గురవుతూ ఉంటాం.

ఇంకా చదవండి ...
    ప్రస్తుత సోషల్ మీడియా (Social Media) యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక ప్రాంక్‌లు, జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియో, భయానకమైవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి, విజ్ఞానాన్ని పెంపొందించేవి కూడా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన ఇప్పుడు వైరలవుతోంది. కొన్ని ఆశ్చర్యకర ఘటనలను తేలిగ్గా కొట్టిపారేసినా.. చూడటానికి మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిత్రాలు కూడా జరుగుతుంటాయా.. అన్నంత విస్మయానికి గురవుతూ ఉంటాం. కొన్ని వీడియోలు గ్రాఫిక్స్‌తో కూడుకున్నవి కాగా.. కొన్ని మాత్రం మన కల్లు కూడా నమ్మలేని విధంగా ఉంటాయి.

    అలాంటి ఓ వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన పైలెట్ ఆకాశంలో ఉండగా.. సముద్రంపై ఆయనకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ దృశ్యం చూసిన వారంతా.. ఇది ఏలియన్స్ పనే అని అంటున్నారు...

    ఓ పైలెట్ పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక.. నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణిస్తూ కనిపించాయి. ఆశ్చర్యానికి గురైన పైలెట్.. వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అయితే కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమవుతాయి.


    అవి ఏలియన్స్ యూఎఫ్‌వోలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు.

    ఎన్నో సంవత్సరాలుగా.. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని.. వారికి మనుషుల కంటే అధిక శక్తులు.. టెక్నాలజీ గురించి తెలుసని చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.గ్రహాంతర వాసులు (ఏలియన్లు) ఉన్నారా లేదా అన్న చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది యూఎఫ్ వో(UFO)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉంటారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Aliens, Trending videos, UFO, Viral Video, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు