A US DELIVERY BOY GET ORDER FROM 1000 KM AWAY HIS HILARIOUS REACTION IS VIRAL IN TIK TOK EVK
Online Food Delivery: అంత దూరం ఫుడ్ డెలివరీ నావల్ల కాదు.. సాండ్ విచ్ వండుకోండి!
ప్రతీకాత్మక చిత్రం (ఫోటో క్రెడిట్ - షట్టర్‌స్టాక్ )
Online Food Delivery: అమెరికాలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి 1192 కి.మీ దూరం ఫుడ్ డెలివరీకి రావాలని ఓ కస్టమర్నుంచి ఆర్డర్ వచ్చింది. దీంతో ఖంగుతినడం అతని వంతైంది. నెను ఫుడ్ అందించలేనని.. చెప్పేశాడు. అంతే కాకుండా తన అనుభవాన్ని టిక్‌టాక్‌లో షేర్ చేసుకొన్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
ప్రపంచంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఘటనలో మనుషుల తీరు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిన్ని విషయాలను మర్చిపోయి అసాధ్యమైన కోరికలు వ్యక్త చేస్తుంటారు. సాధ్యాసాధ్యాలు అసలు ఆలోచించరు. అలాంటి ఘటనే ఒక వ్యక్తి రెస్టారెంట్ (Restaurant) డెలివరీ బాయ్‌కి ఎదురైంది. అతను ఈ విషయాలను టిక్‌టాక్ వీడియోలో పంచుకున్నాడు. ఒక ఆర్డర్ డెలివరీ (Delivery) కోసం సుమారు 741.1 మైళ్లు లేదా 1192 కి.మీ దూరం రావాలని ఓ కస్టమర్నుంచి ఆర్డర్ వచ్చింది. అది కూడా ఒక రాత్రిలో (One Night) డెలివరీ అందించాలని ఇది సాధ్యమయ్యే పనేనా అని అంటూ తన అనుభవాన్ని వీడియోలో షేర్ చేసుకొన్నాడు. ఈ ఘటన అమెరికా (America)లోని ఓహియో రాష్ట్రం (Ohio State)లో జరిగింది.
ఏం జరిగింది..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు నిస్సందేహంగా మన జీవితాలను సులభతరం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము ఇప్పుడు మనకు ఇష్టమైన ఆహారాన్ని సుదూర రెస్టారెంట్ల నుంచి కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే అటువంటి డెలివరీల కోసం 10-15 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా పర్వాలేదు అని అందరూ భావిస్తున్నారు.
అయితే అమెరికాలో ఫుడ్ డెలివరీ వ్యాలెట్ వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి ఆర్డర్ అందుకొంది. ఈ ఆర్డర్‌ను USAలోని ఓహియో రాష్ట్రానికి చెందిన కేలమ్ గ్రాంట్ అందుకొన్నాడు. దీంతో ఖంగుతున్న అతను తన అనుభవాన్ని టిక్‌టాక్ వీడియో రూపంలో పంచుకొన్నాడు. సుమారు 741.1 మైళ్లు లేదా 1192 కి.మీ దూరంలో ఉన్న రోడ్ ఐలాండ్ నుంచి తనకు డోర్‌డాష్ డెలివరీ అభ్యర్థన వచ్చిందని వెల్లడించారు.
ఆర్డర్‌ని పూర్తి చేయడానికి ఒక రోజు మొత్తం ప్రయాణ చేసి తిరిగి వచ్చినా.. తనకు కేవలం $9.25 (రూ. 694) మాత్రమే వస్తాయని తెలిపాడు. అందుకోసమే తను ఆర్డర్‌ను డెలివరీ చేయలేదని తెలిపాడు. ఈ విషయాన్ని అతని టిక్‌టాక్ పేజీ Kaelum (@kaelumgrantt) ద్వారా అందరికీ తెలిపాడు.
ఆహారం గురించి మర్చిపోండి..
అంతే కాకుండా తాను డెలివరీ చేయలేనని.. కాబట్టి సాండ్ విచ్ చేసుకొని తినమని కస్టమర్‌కి ఉచిత సలహా కూడా ఇచ్చానని అతని తెలిపాడు. ఆ భోజనాన్ని ఎవరూ తీసుకురాలేరని.. ఆ ఆహారం గురించి మర్చిపొమ్మని తెలిపాడు. తనను డెలివరీకి పంపకుండా.. సాహసయాత్రకు పంపినట్టు ఉందని జోక్ కూడా చేశౄడు. కేవలం రూ.694కి వెయ్యి కిలో మీటర్లు ఎవరైన ప్రయాణం చేస్తారా అని అన్నాడు.
జోరుగా కామెంట్లు..
అయితే కానీ డెలివరీ అభ్యర్థన మాత్రమే కేలమ్ను ఆశ్చర్యపరిచింది. డెలివరీ సమయం అంచనా వేయడంతో డెలివరీ వాలెట్ మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నాడు. అదే రాత్రి 9:53 గంటలకు ఆర్డర్ డెలివరీ అవుతుందని సూచించిందని తెలిపాడు. ఈ వీడియో టిక్‌టాక్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. దాదాపు 1.5 మిలియన్ లైక్‌లతో పాటు 4.5 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. దీనిపై నెటిజన్లు జోకులు కూడా వేస్తున్నారు. ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు కస్టమర్ బహుశా తాగి ఉంటారని కొందరు.. లేదు వీపీఎన్ ఆఫ్ చేయడం మరిచిపోయాడని కొందరు కామెట్లు చేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.