Home /News /trending /

A UNIQUE EXPERIMENT WITH POPCORN AND WATERMELON COMBINATION VIDEO GOES VIRAL PAH

కాగుతున్న నూనెలో వాటర్ మిలన్.. దానిలో పాప్ కార్న్... ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

పుచ్చకాయతో పాప్ కార్న్ తయారీ

పుచ్చకాయతో పాప్ కార్న్ తయారీ

Viral video: ఎర్రగా కాగుతున్న నూనెలో పుచ్చకాయను వేశాడు. ఆ తర్వాత.. దాన్ని బాగా వేయించాడు. కాసేపయ్యాక దానిలో పాప్ కార్న్ వేశాడు.

కొందరు వెరైటీ ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. రోటీన్ కు భిన్నంటే ఆ టెస్ట్ వేరని భావిస్తుంటారు. తమకు ఇష్టమైన ఫుడ్ కోసం ఎంత దూరమైన వెళ్తుంటారు. మరికొందరు తమకు ఇష్టమైన షుడ్ కోసం నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. యూట్యూబ్ లో చూస్తు రకరకాల ఎక్స్ పెరిమెంట్ లు చేస్తుంటారు. అయితే, కొన్ని చోట్ల ప్రత్యేక మైన ఫుడ్ కోర్ట్ లు ఉంటాయి. అక్కడ బోలేడన్ని వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వెరైటీ ఫుడ్ తయారీ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పాప్ కార్న్(Popcorn)  అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. యువత సాయంత్రం పూట పాప్ కార్న్ ను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పాప్ కార్న్ లు టమాటా, కొతిమిర, ఉల్లిపాయ రకరకాల కాంబినేషన్ లలో లభిస్తుంది. మక్కల నుంచి పాప్ కార్న్ వస్తుంది. పాప్ కార్న్ ను వెరైటీగా పుచ్చకాయ కాంబినేషన్ లో తయారు చేశారు. ఈ వీడియోలో సలసల కాగుతున్న నూనెల పుచ్చకాయను ముక్కలుగా కోసి వేశాడు. ఆ తర్వాత.. దాన్ని వేయించాడు.


అది నూనెలో ఇంకిపోయింది. ఆ తర్వాత.. పాప్ కార్న్ ప్యాకెట్ తీసి దానిలో వేశాడు. కాసేటికి పుటుక్.. పుటుక్.. అంటూ పాప్ కార్న్ లు దాన్నుంచి పైకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోను.. కప్తాన్ హిందూస్థాన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాప్ కార్న్ లను చూస్తే నోట్లో నీరు ఊరుతుందని ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.



ఇదిలా ఉండగా ఒక కోతి కోపంలో వింతగా ప్రయాణించింది.

కోతులు (Little monkey) సాధారణంగా స్వేచ్ఛగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటాయి. అసలు ఒక చోట కుదురుగా ఉండవు. అలాంటి ఒక కోతి పిల్లను తీసుకొచ్చి జూలో పెట్టారు. మనం సాధారణంగా జూలల్లో బోనులలో కోతులను చూస్తుంటాం. కొన్ని సార్లు అవి బోను నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే, ఇక్కడో కోతి కూడా అలాగే ప్రయత్నించింది.

కోతి పిల్ల ముందు ఒక రాయి కన్పించింది. వెంటనే అది తీసుకుని దాని ముందున్న అద్దం మీద పదే పదే కొట్టింది. ఈ క్రమంలో అద్దం కాస్త పగిలింది. వెంటనే కోతి అక్కడి నుంచి భయంతో పారిపోయింది. అద్దానికి అన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. కోతి పిల్లను విడుదల చేయండి., కోతిని హింసించ వచ్చు.., దాని స్వేచ్చను హరించే హక్కు మీకు లేదంటూ .. కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Food, Pop corn, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు