హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: తోటలో రిలాక్స్ అవుతున్న వ్యక్తికి చేదు అనుభవం.. విమానం నుంచి మీద పడిన మానవ విసర్జితాలు..

Viral News: తోటలో రిలాక్స్ అవుతున్న వ్యక్తికి చేదు అనుభవం.. విమానం నుంచి మీద పడిన మానవ విసర్జితాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విమానం నుంచి జనావాసాలపై మానవ విసర్జితాలు చిందిన ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. ఆ దేశంలోని విండ్ సోర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తోటలో ఉండగా.. గాల్లో ఎగురుతున్న విమానం నుంచి మానవ విసర్జిత వ్యర్థాలు ఒక్కసారిగా అతడిపై పడ్డాయి.

విమానాలు జనావాసాలపై నుంచి గాల్లో ఎగురుతూ ఉంటాయి. కానీ విమానం నుంచి ఏదైనా కింద పడటం ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ విమానం నుంచి జనావాసాలపై మానవ విసర్జితాలు చిందిన ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. ఆ దేశంలోని విండ్ సోర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన తోటలో ఉండగా.. గాల్లో ఎగురుతున్న విమానం నుంచి మానవ విసర్జిత వ్యర్థాలు ఒక్కసారిగా అతడిపై పడ్డాయి.

క్లీవర్ ఈస్ట్ కౌన్సిలర్ కరెన్ డేవియస్ ఈ విషయాన్ని బీబీసీలో చూసి భయానికి గురయ్యారట. ఈ ఘటన జులై మధ్యలో జరిగింది. తోట, తోటలోని గొడుగులు మొత్తం వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారని బీబీసీ వెల్లడించింది.

* చాలా అరుదు

విమానాల నుంచి గడ్డ కట్టిన మానవ వ్యర్థాలను తీసివేస్తుంటారు. కానీ గడ్డ కట్టని మానవ వ్యర్థాలను ఇలా గాల్లో ఎగురుతున్న విమానం నుంచి పారేయడం ఎప్పుడూ చూడలేదని డేవియస్ వెల్లడించారు. విమానం నుంచి మానవ వ్యర్థాలను వదిలిన సమయంలో అతడు తోటలో ఉండటం ఒక భయంకరమైన అనుభవమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన ఘటన ఎవరికీ జరగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. వెచ్చని వాతావరణ పరిస్థితుల వల్ల విమానం నుంచి పడిన విసర్జితాలు మెల్ట్ అయ్యాయని ఈటన్ అండ్ కాజల్ కౌన్సిలర్ జాన్ బౌడెన్ చెప్పారు. ఇలా వంద కోట్లలో ఒకసారి జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Viral: ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి.. కడుపులో ఏముందో చూసి షాకయిన డాక్టర్లు

* విమానాల్లో మానవ వ్యర్థాలు ఎలా తొలగిస్తారు

అంతర్జాతీయ విమానాలు రోజుల తరబడి ఆగకుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి. పెద్ద విమానాల్లో అయితే 300 మందికిపైగా ఒకేసారి ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. విమానాల్లో మానవ విసర్జితాలను ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యాక వాటిని శుభ్రపరుస్తూ ఉంటారు.

* ఆ విమానాన్ని ఎలా గుర్తించారంటే

రూట్ ట్రాకింగ్ యాప్ (Route Tracking application) ద్వారా మానవ విసర్జితాలను వెదజల్లిన విమానాన్ని అధికారులు గుర్తించారు. అయితే అది ఏ సంస్థకు చెందిందో మాత్రం బయటకు వెల్లడించలేదు. మానవ వ్యర్థాలు మీద పడిన బాధితుడు.. సదరు విమానయాన కంపెనీపై కేసు వేసి బీమా పరిహారం పొందే ఆలోచనలో లేడని కరెన్ డేవియస్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

First published:

Tags: Flight, Trending news, Uk, VIRAL NEWS

ఉత్తమ కథలు