Viral Video: లైవ్ రిపోర్టింగ్.. మహిళా జర్నలిస్ట్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఫీల్డ్‌లో పనిచేసే జర్నలిస్టుల జీవితం కత్తి మీద సాములాంటిందే. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

news18-telugu
Updated: November 15, 2020, 9:48 PM IST
Viral Video: లైవ్ రిపోర్టింగ్.. మహిళా జర్నలిస్ట్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
(Image-Twitter/Amber Roberts)
  • Share this:
ఫీల్డ్‌లో పనిచేసే జర్నలిస్టుల జీవితం కత్తి మీద సాములాంటిందే. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. వార్తలను ప్రజలకు అందజేయాల్సి ఉంటుంది. అయితే వార్తలు కవర్ చేసే సమయంలో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా విపత్తులు, బాంబు పేలుళ్ల వంటి ఘటనలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ మహిళా జర్నలిస్టు లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో.. ఆమె నిల్చుని ఉన్న బ్రిడ్జి కొంత భాగం కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.

వివరాలు.. ఇటీవల నార్త్ కరోలినాను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఫాక్స్ 46 ఛార్లెట్ టీవీ రిపోర్టర్ అంబర్ రాబర్ట్స్ ఓ బ్రిడ్జిపై నిల్చుని వరద పరిస్థితిని వివరిస్తుంది. వరదల ధాటిగా బ్రిడ్జిలో కొంత భాగం కొద్దిగా వంగిపోయింది. కెమెరామెన్ అక్కడ వరద ఉధృతిని చూపెడుతుండగా.. రిపోర్టర్ నిల్చుని ఉన్న పక్కనే కొంతభాగం కూలిపోయింది. కూలిన భాగం ఏదైతే ఉందో దానిపైనే ఆమె కొన్ని సెకన్ల క్రితం నిల్చుని ఉన్నారు. క్షణాల వ్యవధిలో ఆమె వెనక్కి జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వృత్తి పట్ల ఆమె నిబద్ధతను చూసిన చాలా మంది ఆమెను మెచ్చుకుంటున్నారు.



ఆ ప్రమాదం నుంచి బయటపడిన అంబర్.. వెంటనే మళ్లీ రిపోర్టింగ్ ప్రారంభించారు.. ఇది తనకు, తనతో పాటు సహచర జర్నలిస్టుకు భయంకరమైన అనుభవం ఇది అని చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: November 15, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading