news18-telugu
Updated: February 27, 2020, 11:45 AM IST
1911లో న్యూయార్క్ సిటీ... ఇప్పుడు కలర్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో... వైరల్ వీడియో... (credit - YT - Denis Shiryaev)
New York City 1911 : న్యూయార్క్ సిటీకి సంబంధించి 1911నాటి ఓ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వీడియోను ఇప్పుడు కలర్స్‌లోకి మార్చారు. అలాగే సౌండ్ RR ఎఫెక్ట్స్ ఇచ్చారు. పైగా... 4K రిజల్యూషన్‌తో 60 FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్)... లోకి మార్చడంతో... ఆ వీడియో వైరల్ అయిపోయింది. జస్ట్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఐదు రోజుల్లోనే ఆ వీడియోని 6.77 లక్షల మంది చూశారు. 12వేల మందికి పైగా లైక్ చేశారు. నిజానికి ఇలా వీడియోను అప్‌గ్రేడ్ చెయ్యడం అత్యంత కష్టమైన పని. ఫ్రేమ్ టు ఫ్రేమ్ సెట్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ అద్భుతాన్ని సృష్టించింది... న్యూట్రల్ నెట్‌వర్క్స్‌కి చెందిన డెనిస్ షిర్యావ్. స్వీడన్ కంపెనీ స్వెన్స్కా బయోగ్రాఫ్టీటెర్న్... అమెరికా ట్రిప్‌కి సంబంధించి 1911 నాటి వీడియో కలిగి ఉంది. అక్కడి నుంచీ వీడియో ఫుటేజ్ తీసుకొని... అప్‌గ్రేడ్ చేశారు. గుయ్ జోన్స్... సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. అప్పటి వీడియోని ఇప్పటి వీడియోలా కనిపించేలా చేసిన కష్టాన్ని గుర్తిస్తూ నెటిజన్లు ఈ వీడియో మేకర్స్‌ని మెచ్చుకుంటున్నారు. మరి మీరు కూడా చూడండి. మొత్తం 8.35 నిమిషాల నిడివి ఉంది. అంత పెద్ద వీడియో చూసే టైమ్ లేకపోతే... కొద్దిగా నైనా చూడొచ్చు. అప్పటి ప్రజల జీవన శైలిని వందేళ్ల తర్వాత ఇప్పుడు చూసిన ఫీల్ మర్చిపోలేం.
Published by:
Krishna Kumar N
First published:
February 27, 2020, 11:45 AM IST