Viral video: వధువు డాన్స్ చూసి ఆనంద భాష్పాలు కార్చిన వరుడు.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

వీడియోలోని దృశ్యం

ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో కనిపిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తమ పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మిగలాలని వధూవరులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వివాహ ఘట్టాన్ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు.

  • Share this:
ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో కనిపిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తమ పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మిగలాలని వధూవరులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా తమ వివాహ ఘట్టాన్ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. వరుడు వధువుకి ప్రపోజ్ చేయడం.. వధువు వరుడిపై తనకున్న ఇష్టాన్ని బంధుమిత్రుల సమక్షంలో చెప్పడం ఇప్పుడో కొత్త ట్రెండ్‌గా మారింది.

పెళ్లిళ్లలో వధూవరుల సందడి ఇరు కుటుంబ సభ్యులనే కాకుండా ప్రతి ఒక్కరికీ కన్నుల విందు చేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమాని నవవధువుల ఆనందకరమైన క్షణాలని చూసి ప్రతి ఒక్కరూ పరవశించిపోతున్నారు. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఓ పెళ్లి వీడియో కూడా నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ వీడియోలో ఓ నవ వధువు తాను మనువాడబోయే వాడిపై ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఓ పాటకు అత్యద్భుతంగా డాన్స్ చేసింది. అది చూసి వరుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. వధువు ప్రేమకు ఆనంద భాష్పాలు కారుస్తూ తన ప్రేమను కూడా వ్యక్తపరిచాడు. ఈ బ్యూటిఫుల్ మ్యారేజ్ వీడియోని వెడ్ అబౌట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. కాగా ఇప్పుడది విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Viral News: తోటలో రిలాక్స్ అవుతున్న వ్యక్తికి చేదు అనుభవం.. విమానం నుంచి మీద పడిన మానవ విసర్జితాలు..

వైరల్ అయిన వీడియోలో.. కుందనపు బొమ్మలా కనిపిస్తున్న పెళ్లికూతురు సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమాలోని మే తేరి హో గయి (Main Tera Ho Gayi) అనే లవ్ సాంగ్‌కు చక్కగా డాన్స్ చేయడం చూడొచ్చు. నేను పూర్తిగా నీ దాన్ని అయ్యాను.. నీ కోసం ఏదైనా భరిస్తాను.. కానీ నన్ను వదిలి పెట్టకు అనే అర్థంతో ఈ పాట చాలా భావోద్వేగంగా సాగుతుంది. ఇలాంటి మధురమైన పాట ద్వారా వధువు తన స్వచ్ఛమైన ప్రేమను స్వీట్ గా వ్యక్తీకరించడంతో వరుడు బాగా ఎమోషనల్ అయిపోయాడు.చిన్నపిల్లోడిలా కంటతడి పెట్టుకున్నాడు. ఇది చూసిన వధువు డాన్స్ చేస్తూనే తన కాబోయే భర్త చేతులు పట్టుకుని స్టేజి మీదకు తీసుకెళ్ళింది. వరుడి కళ్ల వెంట వస్తున్న ఆనంద భాష్పాలను తుడిచి అక్కడి బంధుమిత్రులను ఫిదా చేసింది. ఈ దృశ్యాలన్నీ సినిమా పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా చూపరులను మళ్లీ మళ్లీ చూసేలా కట్టిపడేస్తున్నాయి.

వెడ్ అబౌట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ లవ్లీ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ మనోరంజకమైన దృశ్యాలు అందరి హృదయాలను మధురంగా తాకుతున్నాయి. వరుడి రియాక్షన్ సూపర్, ప్రైస్ లెస్, క్యూట్ కపుల్, సో స్వీట్ అంటూ ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే నెటిజన్లు ఈ వీడియోని 2 లక్షల సార్లు వీక్షించారు. దీనికి 17 వేల లైకులు వచ్చాయి. ఈ వీడియోని మీరూ చూసేయండి.
Published by:Sambasiva Reddy
First published: