‘నగర వాసులకు గమనిక.. 5 రోజులు బట్టలు ఉతకొద్దు..’

అక్కడ నీటిలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాంటి నీటితో దుస్తులు క్లీన్ చేస్తే.. బట్టలు పాడైపోతాయి.

news18-telugu
Updated: October 11, 2019, 8:13 PM IST
‘నగర వాసులకు గమనిక.. 5 రోజులు బట్టలు ఉతకొద్దు..’
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘నగర వాసులకు ముఖ్య గమనిక. ఐదు రోజుల పాటు మీరు ఇంట్లో దుస్తులు ఉతకొద్దు.’ ఇలాంటి దండోరా ఎక్కడ వేశారనుకుంటున్నారా. మన దగ్గర కాదులేదు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న సర్ఫ్ సిటీలో. స్థానిక పరిపాలన అధికారులు.. ఓ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ఐదు రోజుల పాటు నగరంలోని ఎవరూ దుస్తులు ఉతకొద్దని సూచించారు. స్థానికంగా వాటర్‌లో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అలాంటి నీటితో దుస్తులు క్లీన్ చేస్తే.. బట్టలు పాడైపోతాయి. కాబట్టి, అధికారులు ఇలాంటి సూచనలు చేశారు. తాగే నీరు, ఇతరత్రా నీటి వినియోగం అంటే వాడకానికి ముందే నీటిని చూస్తాం కాబట్టి సరిపోతుంది. అయితే, వాషింగ్ మెషిన్‌లో దుస్తులు ఉతికే వారు.. కేవలం ట్యాప్ ఆన్ చేసి.. దుస్తులు వాషింగ్ మెషిన్‌లో వేసేసి వెళ్లి.. వేరే పనులు చూసుకుంటారు. దీంతో ఆ దుస్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు ఇలాంటిసూచన చేశారు.

అధికారుల తీరును కొందరు స్థానికులు తప్పుపడుతున్నారు. ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘నేనైతే ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఎన్ని రోజులైందో..’ అంటూ ఓ వ్యక్తి తనకు అసలు విషయమే తెలియదని చెప్పారు. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 11 వరకు ఇలాంటి నిబంధన విధించారు.

మీ పాలలో ప్లాస్టిక్ ఉందా.. ఈ పాలలో ఉంది జాగ్రత్తFirst published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు